• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 15 నుంచి ప్రజల్లోకి సీఎం కేసీఆర్

    ఈ నెల 15 నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు పార్టీ బీ ఫామ్స్ అందజేయడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి.. 17న సిద్ధిపేట, సిరిసిల్ల.. 18న జడ్చర్ల, మేడ్చల్‌లో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    BRSకు ఎమ్మెల్యే రాజీనామా

    BRSకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేస్తానన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. BRS ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యుర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే..

    కేసీఆర్‌పై నడ్డా ఘాటు విమర్శలు

    BRSపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో BRS కుటుంబపాలన అంతం కావడం ఖాయం. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. BRS కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా … Read more

    ‘భారాస ముమ్మాటికి వారసత్వ పార్టీనే’

    TG: భారాస బరాబర్‌ వారసత్వ పార్టీనే అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న వారికి సూర్యాపేట సభలో కౌంటర్ ఇచ్చారు. ‘ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న కేసీఆర్‌ తప్పకుండా తెలంగాణ కుటుంబ సభ్యుడే. మోదీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. కానీ, భారాస ఎందరో త్యాగఫలంతో ఏర్పడిన వారసత్వ పార్టీ. కేసీఆర్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారు. అయితే మోదీ వచ్చి కుటుంబ పాలన అంటున్నారు. శిఖండి రాజకీయాలు తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదు’ అని కేటీఆర్‌ … Read more

    భారాస 25 సీట్లకే పరిమితం: రేవంత్‌

    తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు ఈసారి 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ షేర్ తమకే వస్తుందన్నారు.

    తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి: నామా

    సత్తుపల్లిలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో రాజ్యసభ సభ్యుడు నామ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణతో రైతు కష్టాలు తొలగాయి. భారతదేశంలో ఏకైక రైతు నాయకుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని పార్లమెంట్‌లో రైతుల పక్షాన పోరాడాలి అని కేసీఆర్ నాకు ప్రతిసారి చేప్పేవారు. గతంలో అప్పులు ఆత్మహత్యలు జరిగేవి. పోరాడి సాధించుకున్న తరువాత తెలంగాణలో రైతన్నకు పెద్దపీట వేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.

    భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. ఎమ్మెల్యేను ఓదారుస్తూ పక్కనున్నవారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య.. అంబేడ్కర్ విగ్రహం ముందు మోకరిల్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గీత దాటనని రాజయ్య స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని … Read more

    BRS తొలి జాబితా ఇదే

    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పూర్తి జాబితా ప్రకటించారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పూర్తి జాబితా కోసం YouSay Webపై క్లిక్ చేయండి. రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 … Read more