• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే రెండు చోట్ల పోటీ: కేసీఆర్

    రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృది ఆగదని ఇంకా ముందుకు సాగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీలను గెలుస్తున్నాము. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతాం. నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఉండకూడదనేదే మన లక్ష్యం. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదు, కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్నికారణాలు ఉన్నాయి’ అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

    ఆ మూడు పార్టీలు ఒక్కటే: రాహుల్

    తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.. ‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటే, కేంద్రం బీఆర్‌ఎస్‌‌కు మద్దతు పలుకుతుంది. బీజేపీ నాపై 24 కేసులు పెట్టింది. మరి అదే బీజేపీ కేసీఆర్‌ మీద ఎన్ని కేసులు పెట్టిందో చెప్పాలి. కేసీఆర్‌ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవు దేశంలోనే అవినీతి సీఎం కేసీఆర్’ అని రాహుల్ ఆరోపించారు.

    దొర ఇలాకలో మనకు మంచి రోజులు: రాహుల్

    ములుగు బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణకి.. ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం. దొర ఇలాకాలో మనకీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను లూటీ చేస్తుంది. కర్ణాటకలో మహిళలందరూ ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. నేను అబద్ధం చెప్పను. పనికి మాలిన మాటలు చెప్పను. కేసీఆర్‌లా 3 ఎకరాల భూమి ఇస్తాం లాంటి హామీలు ఇవ్వడానికి రాలేదు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం’ అని హామీ ఇచ్చారు.

    ‘ఆ పార్టీలను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి’

    ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను గెలిపిస్తే రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది. కొత్తగా రాష్ట్రం తెలంగాణను రెండు సార్లు కేసీఆర్ చేతిలో పెట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల్లో మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వచ్చాయి. కరెంటు ఉంటుంది. మూడో సారి కూడా బీఆర్‌ఎస్ తప్పక గెలుస్తుంది’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

    నేడు మేడ్చల్, జడ్చర్లలో కేసీఆర్ సభ

    నేడు పాలమూరులో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. జడ్చర్ల, మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రజలకు వివరిస్తారు. ఈ రెండు సభలకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. జడ్చర్లలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.

    కాంగ్రెస్‌తో పెను ప్రమాదం: కేసీఆర్

    సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలపై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారని మడిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోలు వచ్చి పెత్తనం చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ధరణి ఉండాలో?.. రద్దు కావాలో? రైతులే నిర్ణయించుకోవాలి కేసీఆర్ సూచించారు.

    సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు మధ్యాహ్నం తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో కేసీఆర్ సభలు

    నేడు సిరిసిల్ల, సిద్దిపేటలో జరగనున్న బీఆర్ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత సిరిసిల్ల ఆ తర్వాత సిద్దిపేట సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటా రు. ఈమేరకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్ష మందితో జరిగే సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సిద్ధిపేటలో సుమారు 20 వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సిరిసిల్ల, సిద్ధిపేట పట్టణాలు గులాబీమయం అయ్యాయి.

    కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది: కేసీఆర్

    జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉంది. రెవెన్యూలో అవినీతి తగ్గించేందుకే ధరణి తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తుంది. కాంగ్రెస్‌ వస్తే పైరవీకారులు, దళారులు రాజ్యమేలుతారు. భువనగిరిలో స్పెషల్‌ ఐటీ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    జనగామకు KCR హామీల వర్షం

    జనగామ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని తెలిపారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనగామకు ఐటీ, పారిశ్రామికంగా విసృత అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.