• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ స్థానాల్లో సా. 4 వరకే పోలింగ్‌: ఈసీ

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 4 వరకే పోలింగ్‌ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉ. 7 నుంచి సా. 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

    భారాసపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

    TG: భారాస ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచనలు చేశాం. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని చెప్పాం. భారాస కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను రాష్ట్రంలో నియమించాలని ఈసీని కోరాం’ అని రేవంత్ తెలిపారు.

    నేడు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి

    మూడో రోజు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. ఈరోజు ఎన్నికల ప్రచారకర్తలతో సమావేశం నిర్వహించనుంది. దివ్యంగా ఓటర్ల చైతన్య కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. పలువురు ప్రముఖులతో సీఈసీ ముఖాముఖి చేపట్టనుంది. నేడు ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సీఈసీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

    21-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం – గ్యాస్ సిలిండర్ కు రూ. 200 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపిన కేంద్రం. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ – తెలంగాణలో విద్యా విధానాన్ని పూర్తిగా మారుస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ – SR నగర్లో పోలీస్ స్టేషన్ నుంచి దూకిన నిందితుడు – ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా. దయానంద్ నుంచి బాధ్యతలు తీసుకున్న ముకేష్ – దేశంలో … Read more