• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రికార్డులు బ్రేక్‌ చేసిన భారత్- పాక్ మ్యాచ్

  నిన్న జరిగిన భారత్- పాక్ మ్యాచ్‌కు డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రికార్డు వ్యూయర్ షిప్ లభించింది. దాదాపు 3.5 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లభించని ఓటీటీ రెస్పాన్స్ ఇండియా- పాక్‌ మ్యాచ్‌కు లభించింది. దీంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఇండియా- పాక్ మ్యాచ్ అంటేనే ప్రేక్షకుల మధ్య హైవోల్టేజీ జనరేట్ అవుతుంది. ప్రేక్షకుల మధ్య భావోద్వేగాలతో మిళితమై ఉంటుంది.

  టాస్‌ నెగ్గిన భారత్‌.. పాక్‌కు బ్యాటింగ్‌

  పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు ఇలా.. భారత్‌: రోహిత్, గిల్‌, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దుల్‌ ఠాకూర్‌, బుమ్రా, సిరాజ్. పాక్‌: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌

  రోహిత్‌తో జాగ్రత్త: పాక్‌ మాజీలు

  భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో పాక్‌ బౌలర్లకు ఆ జట్టు మాజీలు వసీమ్‌ అక్రమ్, మిస్బా ఉల్ హక్‌ కీలక సూచనలు చేశారు. ‘రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడికి బౌలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోహ్లీ కూడా రెండు వరుస హాఫ్‌ సెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. కానీ, కోహ్లీ కంటే రోహిత్‌ విభిన్న తరహా బ్యాటర్‌. బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. అతడికి బౌలింగ్‌ ఎక్కడ వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేయాల్సిందే’ అని సలహా ఇచ్చారు.

  భారత్‌ vs పాక్ మ్యాచ్.. గెలుపెవరిది?

  వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ అహ్మదాబాద్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌ను పక్కన బెట్టొచ్చు. మోదీ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్‌ ముగ్గురు స్పిన్నర్లు (జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌)తో బరిలోకి దిగవచ్చు. మరోవైపు శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఊపులో బాబర్ సేన ఈ మ్యాచ్‌లో అడుగు పెడుతోంది. భారత్‌లాగే పాక్‌ కూడా ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌లు … Read more

  ‘పాక్-ఇండియా మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి’

  సోషల్ మీడియాలో #BoycottIndoPakMatch ట్రెండింగ్‌లో ఉంది. మన సైనికుల జీవితాల ముందు క్రికెట్ నథింగ్. శత్రువులు ఎప్పటికీ శత్రువులే. పాక్ క్రికెటర్లకు మహిళలతో డ్యాన్స్‌లు చేయిస్తూ స్వాగతం పలికాం.. కానీ అదే రోజు మన సైనికులను పాక్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. పుల్వామా వంటి ఘటనలను ఇంకా దేశ ప్రజలు మరిచిపోలేదు. పాక్ క్రికెటర్లను బాయ్ కాట్ చేయాలి. బీసీసీఐ టెర్రరిస్టులకు మద్దతుగా నిలుస్తోంది అని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కొత్తగా 14వేల టికెట్లు

  వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని భావించే వారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. కొత్తగా 14 వేల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. భారత్‌-పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

  ‘భారత్ అంటే పాక్‌ వణుకుతోంది’

  భారత్‌తో మ్యాచ్‌ అంటేనే తమ ఆటగాళ్లు వణికిపోతున్నారని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్ మొయిన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. సీనియర్లు ఎవరూ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌కు సలహాలు ఇవ్వడం లేదన్నాడు. ‘పాక్‌ జట్టు సమిష్టిగా ఉన్నట్లు అస్సలు కనిపించలేదు. గేమ్‌ ప్లాన్‌ గురించి ఆటగాళ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయో లేదో అని నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ సీనియర్లు సలహాలు ఇచ్చినా.. వాటిని పాటించడం లేదేమో. ఎందుకో తెలియదు కానీ, భారత్‌తో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ ప్లేయర్స్ వణికిపోతున్నారు’ అని అన్నాడు.

  పాక్‌ను చిత్తు చేసిన భారత్

  ఆసియా గేమ్స్‌- హాకీలో పాకిస్తాన్‌పై 10-2 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో పాక్‌ను చిత్తు చేశారడు. తాజా విజయంతో గ్రూప్‌ ఏలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు లభించాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 216 పతకాలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

  బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన షహీన్ అఫ్రీది

  పాకిస్థాన్ బౌలర్ షహీన్ అఫ్రిది టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. బుమ్రా తండ్రి అయిన సందర్భంగా అభినందించాడు. కాంగ్రాట్యులేషన్ చెబుతూ బహుమతి చేతికందించాడు. ప్రతిగా బుమ్రా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల బుమ్రా భార్య సంజనా గణేషన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బుడ్డోడి పేరును ఆనంద్ బుమ్రాగా పెట్టినట్లు బుమ్మా తెలిపాడు. Shaheen Afridi gave a gift to Jasprit Bumrah and congratulated … Read more

  ASIA CUP: ఇండియా Vs పాక్ మ్యాచ్ రద్దు?

  యావత్ క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్‌లో భారత్- పాక్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉంది. మ్యాచ్ జరగనున్న పల్లెకెలెలో ఉదయం భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో పాక్-ఇండియా మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు గూగుల్‌లో శ్రీలంక వాతావరణ అప్‌డెట్స్‌పై సెర్చ్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి వర్షం కొనసాగితే మాత్రం ఆటను రద్దు చేసే అవకాశం ఉంది. Rain … Read more