• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధనవంతులైన దర్శకులు ఎవరంటే?

  భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకుల జాబితాను జీక్యూ ఇండియా ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌ నుంచి ఎస్‌ఎస్‌ రాజమౌళి మాత్రమే ఉన్నారు. కరణ్ జోహార్ రూ.1640 కోట్లతో మెుదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో రాజ్‌ కుమార్‌ హిరాణీ రూ.1105 కోట్లతో.. సంజయ్‌ లీలా భన్సాలీ రూ.940 కోట్లతో మూడో ప్లేస్‌లో నిలిచారు. తర్వాత వరుసగా అనురాగ్ కశ్యప్ రూ. 720 కోట్లు, కబీర్ ఖాన్ రూ. 300 కోట్లు, రోహిత్ శెట్టి రూ. 280 కోట్లు, రాజమౌళి రూ. 158 కోట్లతో ఉన్నారు.

  బాలీవుడ్ స్టార్లపై కరణ్ జోహార్ ఆగ్రహం

  భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్టార్లపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాని హిట్ చేయడంలో విఫలమయ్యే నటీనటులు.. పారితోషికం విషయంలో మాత్రం పక్కాగా వ్యవహరిస్తారని కరణ్ వ్యాఖ్యానించారు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో నాకు జరిగిన అనుభవం ఇది. అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను పరిచయం చేశా. హిట్టయ్యింది. కానీ, డబ్బులు రాలేదు. బిజినెస్‌మ్యాన్‌గా ఆలోచిస్తే తెలుగు సినిమాల్లోనే లాభం ఉంటుంది. కానీ, నాకు సినిమా అనేది ఒక ఎమోషన్’ అంటూ కామెంట్లు చేశారు. … Read more

  వారసురాలు అంటే భాధ కలుగుతోంది: జాన్వీ

  వారసత్వ ముద్ర వేయడం తనకు భారంగానే అనిపిస్తోందని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అన్నారు. కరణ్ జోహార్ తనను సినీ వారసురాలని ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగిస్తోందన్నారు. కరణ్ ఎన్నో మంచి చిత్రాలు తీస్తున్నారని.. ఆయన సినిమాల్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమకు ధడక్ చిత్రం ద్వారా జాన్వీ పరిచయం అయ్యింది. కొన్ని సినిమాలు హిట్ అయినా అనుకున్న స్థాయిలో స్టార్ డమ్ రాలేదు.

  ట్విటర్‌కి కరణ్ జోహార్ వీడ్కోలు

  బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన చివరగా చేసిన ‘మరింత సానుకూల దృక్పథం కోసం ట్విటర్‌ని వీడుతున్నా’ననే ట్వీట్‌తో ఇది స్పష్టమవుతోంది. ట్విటర్ నుంచి కరణ్ వైదొలగడంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరేమో ‘పిట్టగూడును వీడి ఉండేది కాదని అంటుండగా.. ట్విటర్‌లో ఉండి మాత్రం ఏం చేస్తాడులే’ అని మరికొందరు రిప్లై ఇస్తున్నారు. ట్విటర్ నుంచి కరణ్ వెళ్లిపోవడమే కాకుండా.. అకౌంట్‌ని కూడా డీ యాక్టివేట్ చేయడం గమనార్హం. ‘కాఫీ విత్ కరణ్’షోకి వ్యాఖ్యాతగా కరణ్ జోహార్ … Read more

  అందుకే తాప్సిని పిలవలేదు: కరణ్

  ‘కాఫీ విత్ కరణ్’ షోకి హీరోయిన్ తాప్సిని ఆహ్వానించకపోవడంపై కరణ్ జోహార్ స్పందించారు. తాప్సికి తగిన జోడీ దొరకలేదని.. అది కుదిరితే తానే స్వయంగా ఇన్వైట్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఆహ్వానించాక రాకపోయి ఉంటే బాధపడేవాడినన్నాడు. అయితే, ఆ షోలో పాల్గొనేంత ఆసక్తికరంగా తన శృంగార జీవితం లేదని గతంలో తాప్సి వెల్లడించింది. ఈ షోలో వచ్చే సెలబ్రీటలను సెక్స్ గురించే కరణ్ ఎక్కువ ప్రశ్నలు అడిగేవాడు. కాగా, ‘కాఫీ విత్ కరణ్’ షో 7వ సీజన్ ముగిసింది.

  కరణ్ వల్లే లైగర్ ఫ్లాప్; వర్మ

  లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం చిత్ర నిర్మాత కరణ్ జోహార్ అని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌లో బాయ్‌కాట్ లైగర్ ఉద్యమం రావడానికి కరణ్ ఒక కారణం. అతనికి ఈ సినిమాకు సంబంధం ఉండడం వల్లే బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత కరణ్ సినిమాలను అన్నింటినీ బాలీవుడ్ ప్రజలు బహిష్కరిస్తున్నారు. మరో వైపు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా వారికి నచ్చి ఉండకపోవచ్చు’’ అని … Read more

  ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

  పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

  నచ్చితే చూడండి లేకుంటే లేదు: కరణ్‌ జోహార్‌

  సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై బాలివుడ్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ స్పందించారు. తాను ట్రోల్స్‌ అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పారు. బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ అనేది ఒక గ్రూప్‌ అని వారిని తాను పట్టించుకోనన్నారు. తమ సినిమా చూడమని ఎవర్నీ ఒత్తిడి చేయట్లేదని ‘ వారికి నచ్చిన అంశం సినిమాలో ఉంటే చూస్తారు. లేకుంటే లేదు. తలకు గన్‌ పెట్టి సినిమా చూడమని అయితే చెప్పలేం కదా!’ అని కరణ్‌ జోహార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. Watch on twitterపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. … Read more

  బ్రహ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఆలియాభ‌ట్

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ ఆలియా భ‌ట్ మ‌రికొన్ని రోజుల్లో త‌ల్లి కాబోతుంది. ప్ర‌స్తుతం ఆమె ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. బ్ర‌హ్మాస్త్ర మొద‌టి భాగం శివ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. భ‌ర్త ర‌ణ్‌బీర్‌తో క‌లిసి ఆమె ఈ సినిమాలో న‌టించింది. తాజాగా ఆలియా, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ క‌లిసి క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్‌లో క‌నిపించారు. బ్లూ క‌ల‌ర్ షార్ట్‌ టాప్‌పై వైట్ క‌ల‌ర్ కోట్‌తో ఆలియా స్టైలిష్‌గా క‌నిపించింది. బ్ర‌హ్మాస్త్ర‌లో అమితాబ్, నాగార్జున‌, మౌనీరాయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  ‘నేను, ఆలియా మందు తాగి విక్కీకి ఫోన్ చేశాం’

  మోస్ట్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’లో ఆ షో హోస్ట్ కరణ్ జోహార్ ఆసక్తికరమైన విషయం పంచుకున్నాడు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంటున్నారని తెలుసుకొని తాను, ఆలియా వైన్ తాగి విక్కీకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పామని తెలిపాడు. విక్కీ, కత్రినా ప్రేమకు పూర్తి క్రెడిట్ తానే తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఈ షోలో విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు.