• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌కు కేటీఆర్‌ బహిరంగ సవాల్‌

  వృద్ధిరేటులో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. ‘రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న భాజపా హామీ ఏమైంది?. కర్ణాటకను మోడల్‌గా కాంగ్రెస్‌ నేతలు చూపుతున్నారు. కర్ణాటక రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వారికి మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామని ఆరోపిస్తున్నారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం.. సిద్ధమా?’ అని కేటీఆర్‌ సవాలు విసిరారు. ⬆️ అటు రూరల్ డెవలప్‌మెంట్, ఇటు అర్బన్ … Read more

  ‘ఆ పార్టీలను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి’

  ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను గెలిపిస్తే రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది. కొత్తగా రాష్ట్రం తెలంగాణను రెండు సార్లు కేసీఆర్ చేతిలో పెట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల్లో మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వచ్చాయి. కరెంటు ఉంటుంది. మూడో సారి కూడా బీఆర్‌ఎస్ తప్పక గెలుస్తుంది’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

  అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

  ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.

  KCR గెలుపు కోసమే మోదీ పర్యటన: రేవంత్

  బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీల స్నేహ బంధాన్ని నిజామాబాద్‌ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే ఆ రెండు పార్టీల ఉద్దేశమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.

  త్వరలో 3 నిర్మాణాలు KCRచే ప్రారంభం

  తెలంగాణ కొత్త సచివాలయ భవనం పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో హైదరాబాద్‌లో 3 మెగా ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయం పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి కాగా, డోమ్, చుట్టూ ప్రహారి గోడ వంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ మూడు నిర్మాణాల్లో.. 1. అంబేద్కర్ పేరుతో తెలంగాణ సెక్రటేరియట్ 2. తెలంగాణ అమరవీరుల స్మారకం 3. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం The New Secretariat building of … Read more

  కిషన్‌రెడ్డి అన్నా వెల్ డన్: కేటీఆర్

  కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్‌లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం వాటిని కేంద్రమంత్రి ప్రారంభించగా, ఎంపీ తన నియోజకవర్గానికి చాలా పెద్ద పని చేశారని తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారత ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టును తీసుకురావడంలో కిషన్ రెడ్డి గొప్ప విజయం సాధించారని దుయ్యబట్టారు. చివరగా కిషన్ రెడ్డి అన్నా వెల్ డన్ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. The 3 … Read more

  బెంగళూరు వరదలపై కేటీఆర్ స్పందన

  దేశ ఐటీ రాజధాని బెంగళూరులో వరదలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పట్టణీకరణను అప్‌గ్రేడ్ చేయడంలో తగినంత మూలధనం ఇన్‌వెస్ట్ చేయనందున మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోతాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మన నగరాలు రాష్ట్రాలకు ఆర్థిక ఇంజన్ల వంటివన్నారు. అవి దేశ వృద్ధికి తోడ్పాటునిస్తాయని వెల్లడించారు. పట్టణ ప్రణాళిక నిర్వహణకు ధైర్యవంతమైన సంస్కరణలు అవసరమని మంత్రి చెప్పారు. తాగునీరు, రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించడం పెద్ద కష్టమైన పని కాదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కేటీఆర్ ట్యాగ్ చేశారు. To all … Read more

  రేపిస్టులు మరణించే వరకు జైల్లోనే ఉండాలి: కేటీఆర్

  జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో కూడా బెయిల్ మంజూరు చేశారన్న దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. రేపిస్టులు అరెస్టైన 45 రోజుల తర్వాత తెలంగాణ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. జువెనైల్ యాక్ట్, IPC & CrPCలో లొసుగుల కారణంగా రేపిస్టులు బెయిల్‌పై వచ్చారన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్లో 11 మంది రేపిస్టుల విడుదలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ … Read more

  NDRF నిధుల్లో తెలంగాణకు సున్నా..ప్రశ్నించిన KTR

  కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా NDRF ఫండ్స్ ఫొటోలు జతచేశారు. వాటిలో 2018 నుంచి ఇప్పటివరకు NDRF నిధుల్లో కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఫండ్స్ ను ఇచ్చినట్లు మ్యాపులో పేర్కొన్నారు. 2020 హైదరాబాద్ వరదల నుంచి 2022 గోదావరి వరదల వరకు రాష్ట్రానికి సాయం అందించలేదన్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష అంటూ, సబ్కా సాత్, సబ్కా వికాస్ ఇదేనా అని KTR … Read more