• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చంద్రబాబును పరామర్శించిన పవన్‌

  టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పరామర్శించారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.

  నాగబాబు ఎమోషనల్ పోస్ట్

  నటులు వరుణ్‌- లావణ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహంలో మెగా బ్రదర్స్‌ నాగబాబు, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లు దిగిన ఫొటో వైరల్‌గా మారింది. నాగబాబు ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ఓ ఎమోషనల్‌ నోట్‌ రాశారు. ‘మా మధ్య ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా.. మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకం. ఈ ఫొటో ఓ జ్ఞాపకం మాత్రమే కాదు అంతకు మించింది.. ఇది ఎప్పటికీ విడదీయరానిది. బలమైనది. దీనికి నేనెంతో విలువనిస్తాను’’ అంటూ ఇన్‌స్టాలో నాగబాబు రాసుకొచ్చారు.

  మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌-లావణ్య

  నటుటు వరుణ్‌ తేజ్‌ -లావణ్య త్రిపాఠిల వివాహం ఘనంగా జరిగింది. ఇటలీలోని టస్కానీ వేదికగా నిన్న రాత్రి వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి నితిన్‌, ఆయన సతీమణి షాలినీతో హాజరయ్యారు, ఇక సినీ ఇండస్ట్రీ, ప్రముఖుల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

  ‘ఓజీ’లో మరో నటుడు.. ఎవరంటే?

  పవన్‌ కళ్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఇందులో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో నటుడు భాగస్వామి అయ్యారు. ‘అన్నయ్య’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన నటుడు వెంకట్‌ ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కొంతమేర చిత్రీకరణ కూడా అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

  అందుకే పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటారు: అంబటి

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌కు స్వాంత రాజకీయ ఆలోచన లేదన్నారు. చివరకు లోకేష్ పల్లకి మోసేందుకు పవన్ రెడీ అయ్యారని విమర్శించారు. టీడీపీని కాపాడేందుకు పవన్ ప్రత్నిస్తున్నాడని చెప్పారు. అందుకే పవన్‌ని ప్యాకేజీ స్టార్ అంటారని ఎద్దేవా చేశారు. సున్నా సున్నా కలిస్తే వచ్చేది సున్నానే అని టీడీపీ-జనసేన కలిస్తే కూడా అంతేనన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు.

  వైసీపీని ఇంటికి పంపాల్సిందే: పవన్

  వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. వైసీపీ నేతలు అన్ని పార్టీల నాయకుల్నీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధే జనసేనకు ముఖ్యమని తెలిపారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి వైసీపీ తెగులు పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామని పవన్ పేర్కొన్నారు.

  అలా అగౌరవంగా మాట్లాడటం తప్పు: అనసూయ

  తన గురించి చులకనగా మాట్లాడిన ఓ నెటిజన్‌పై నటి అనసూయ అసహనం వ్యక్తం చేశారు. నిన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొడాలి నాని, వంశీలు ఆ తోపులాటలో ఇరుక్కుపోయారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ అనసూయ, రష్మీలు వచ్చినా జనాలు ఇలాగే ఎగబడతారు. అని కామెంట్ చేశాడు. ‘ఇలా అగౌరవంగా మా పేరు లాగడం … Read more

  నేతలకు పవన్ దిశానిర్దేశం

  అమరావతి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. టీవీ చర్చలు, ప్రెస్‌ మీట్లు, సోషల్‌ మీడియా ప్రచారంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు.

  సీఎం పదవి కాదు ప్రజల భవిష్యత్తే ముఖ్యం: పవన్

  సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పని చేయాలని దిశానిర్థేశం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తాను ఏరోజూ సీఎం పదవి కోసం విముఖత చూపలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన సరిచేసుకుని ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు.

  అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా: రేణూ

  తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ క్లారిటీ ఇస్తూ. ‘రెండో పెళ్లిని ఇంట్లో పెద్దలు కుదిర్చారు. అప్పుడు మా అమ్మాయికి 7 ఏళ్లు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పాపకు సరిగా సమయం కేటాయిస్తానో.. లేదో అనిపించింది. అందుకే క్యాన్సిల్‌ చేసుకున్నా. ఆద్యకు ఇప్పుడు 13ఏళ్లు. తను ఇంకాస్త పెద్ద అయ్యాక నా రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటా’ … Read more