• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రష్యాకే మా మద్దతు: ఉత్తరకొరియా

  ఉక్రెయిన్‌, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము రష్యా వైపు ఉంటామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ సోదరి కిమ్‌ యో జోంగ్ స్పష్టం చేశారు. తమ మద్దతు పుతిన్‌ సర్కారుకు ఉంటుందని వెల్లడించారు. “ రష్యా ప్రజలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు ధృడంగా నిలబడ్డారు. ఉక్రెయిన్‌కు అబ్రామ్స్‌ ట్యాంకులను అందించాలని అమెరికా నిర్ణయం తీసుకోవడం చాలా నీచమైంది. రష్యా చేతిలో అమెరికా, పశ్చిమ దేశాల ఆయుధాలు ముక్కలుగా మారతాయి” అన్నారు.

  రష్యా రాకెట్ దాడులు; 600 మంది హతం

  రష్య జరిపిన రాకెట్ దాడుల్లో 600 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. డాన్‌టెస్క్ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడుల్లో 89 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు తెలిపింది. ఉక్రెయన్ సైనికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇళ్లపై దాడులు చేశామని పేర్కొంది. ఒక రెసిడెన్సీలో 700 మంది సైనికులు ఉంటే 600 మందిని రాకెట్ దాడుల్లో మట్టుబెట్టినట్లు వివరించింది.

  అమెరికా అధ్యక్షడిగా ఎలాన్ మస్క్.. జోస్యం!

  రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వేదేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో అమెరికా ఎలా ఉంటుందో జోస్యం చెప్పారు.అమెరికాలో అంతర్యుద్ధం జరగనుందని, ఫలితంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌ రాష్టాలు స్వతంత్ర రాష్టాలుగా విడిపోయే పరిస్థితి ఉందని ట్వీట్ చేశారు.ట్విట్టర్‌ బాస్‌ ఎలన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడవుతారని జోస్యం చెప్పారు. ఈ ట్వీట్‌పై స్పందించిన మస్క్.. మెద్వేదేవ్ పురాణ కథలను వల్లవేశారని గట్టి కౌంటర్ ఇచ్చారు.

  యుద్ధం మరింత మెరుగ్గా ముగిస్తాం

  ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత మెరుగ్గా ముగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అన్నారు. ఈ యుద్ధాన్ని వేగంగా ముగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి యుద్ధం ఏదోరకంగానో, చర్చల ద్వారానో ముగుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా ముగుస్తుందని అన్నారు. మరో వైపు రష్యా ఆర్మీ చీఫ్ గెరిస్మోవ్ మాట్లాడుతూ..‘డొనెట్క్స్‌కు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తాం. ఈ ప్రాంతంలో విద్యుత్తు, రవాణా సౌకర్యాలు దెబ్బ తింటున్నాయి. వాటిని పునరుద్ధరణ చేస్తాం.’’ అంటూ పేర్కొన్నారు.

  అమెరికా క్షిపణులను కూల్చాం: రష్యా

  క్షిపణుల కూల్చివేతపై రష్యా తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న 4 క్షిపణులను కూల్చివేసినట్లు రాజధాని మాస్కో ప్రకటించింది. ఈ 4 మిసైల్స్ అమెరికాలో తయారైనట్లు తెలిపింది. హెచ్ఏఆర్ఎం యాంటీ రేడార్ మిస్సైల్స్ దూసుకురాగా.. వాటిని కూల్చామని సోషల్ మీడియా వేదికగా రష్యా వెల్లడించింది. దాదాపు 10 నెలలుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగిస్తోంది. క్షిపణులతో భీకర దాడులకు పాల్పడుతోంది. ఉక్రెయిన్‌లోని ముఖ్యమైన నగరాలపై దాడికి దిగుతూ అతలాకుతలం చేస్తోంది.

  ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి వాన

  ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి మిసైల్స్‌తో విరుచుకుపడింది. శుక్రవారం ఏకంగా 70 క్షిపణులు ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని తెలుస్తోంది. దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ అపార్ట్‌మెంట్‌ ధ్వంసమైంది. రష్యా వద్ద ఇంకా అనేక క్షిపణులు ఉన్నాయని, వారు మరింత తీవ్రంగా దాడి చేసే అవకాశముందని, తమ రక్షణ వ్యవస్థకు సాయమందించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను కోరారు.

  రష్యాకు వ్యతిరేకంగా భారత్ పనిచేసేలా కుట్ర

  భారత్‌ను రష్యాకు వ్యతిరేకంగా మార్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్‌ ఆరోపించారు. వ్యతిరేక కూటమిలోకి భారత్‌ను లాగేందుకు నాటో ప్రయత్నిస్తోందన్నారు. మాస్కోకు ముప్పు వాటిల్లేలా చైనా సమీపంలో ఉద్రిక్తతలు పెంచుతున్నారని పేర్కొన్నారు. నాటో తన ఆధిపత్యం చెలాయించాలనుకున్న ప్రాంతాల్లో దక్షిణ చైనా సముద్రం చేరిందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విషయంలోనూ ఇలాగే చేసి ఉద్రిక్తత పెంచిందని తెలిపారు.

  రష్యా సేనలకు అత్యాచారం మరో ఆయుధం

  ఉక్రెయిన్ లో ఆడవారిపై అత్యాచారం చేయాలని రష్యన్ సైనికులను వారి భార్యలు ప్రోత్సహిస్తున్నారని ఆ దేశ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కీ ఆరోపించారు. మాస్కో సేనలు అత్యాచారాలను ఆయుధాలుగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. మహిళలపై లైంగిక హింస అరికట్టాలనే అంశంపై లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. వారియుద్ధంలో ఇది కూడా భాగస్వామ్యం అయ్యిందంటూ ఘాటు విమర్శలు చేశారు.

  మానవాళి నెత్తిన మరో పిడుగు; మంచులో జాంబీ వైరస్ జాడ

  రష్యాలోని సైబీరియా మంచు ప్రాంతంలో 48,500 ఏళ్ల నాటి జాంబీ వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో పాటు మరో 13కు పైగా వైరస్‌లను వారు వెలికితీశారు. వేల సంవత్సరాలు ఈ వైరస్‌లు నిద్రాణ స్థితిలో ఉన్నాయని, అయినా వ్యాధికారక శక్తిని కోల్పోలేదని సైంటిస్టులు తెలిపారు. జాంబీ వైరస్‌లు అంటువ్యాధులుగా మారే అవకాశాలున్నాయని, బాహ్య ప్రపంచంలోకి వస్తే మానవాళికి ముప్పు తప్పదని వారు చెబుతున్నారు. ఈ పరిశోధనలో జర్మనీ, ఫ్రాన్స్, రష్యా సైంటిస్టులు పాల్గొన్నారు.

  రష్యా క్షిపణిని కూల్చిన ఉక్రెయిన్ సేనలు

  [VIDEO:](url) ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా సేనలు క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. రష్యా మిసైల్ దాడులను ఉక్రెయిన్ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. తాజాగా తక్కువ ఎత్తులో వచ్చి రష్యా క్రూయిజ్ క్షిపణిని ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేశాయి. ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Spectacular footage: Two Russian Kalibr cruise missiles shot down within seconds over Kyiv Oblast … Read more