సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అసలు నిజనిజాలు ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక సంఘటనను ఎవరికి వారు తమకు నచ్చినట్లు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అచ్చం అలాంటి వార్తే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. రష్యా చేసిన దాడిలో వందలాది మంది చనిపోయారని ఓ రిపోర్టర్ మృతదేహాలతో కూడిన వీడియోను పోస్టు చేశాడు.
రష్యా కాల్పుల్లో ఉక్రెయిన్‌లోని ఖర్కొవ్ నగరంలో వందలాది మంది శవాలయ్యారని నల్ల కవర్లలో చుట్టిన డెడ్‌బాడీలను చూపిస్తుండగా ఆ వీడియోలో ఓ వ్యక్తి నల్ల కవర్ కప్పుకొని శవంలా నటించడానికి పూనుకున్నాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. జర్నలిజం ఇలా లేనివి ఉన్నట్లు చూపిస్తుందని కొందరు, అసలు మన కళ్ల ముందు కనిపించని నిజాలు చాలా ఉంటాయని మరికొందరు విమర్శించారు. కొంతమంది జర్నలిస్టులు అత్యుత్సాహం ప్రదర్శించి వాస్తవాలను ఇలా తారుమారు చేస్తారని ఆరోపించారు. మరికొందరేమో ఇది కదా అసలు జర్నలిజం అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.
అసలు ట్విస్ట్ ఇది
తప్పుడు సమాచారాన్ని అందిస్తూ జర్నలిజం విలువలను తుంగలో తొక్కుతున్నారంటూ ఈ వీడియో వైరల్ కాగా.. అసలు ట్విస్ట్ బయటపడింది. అసలు ఈ వీడియో ఖర్కొవ్ నగరానికి సంబంధించింది కాదని బయటపడింది. వియన్నాలో ఫిబ్రవరి 4న కొందరు వాతావరణ మార్పులపై నిరసన వ్యక్తం చేస్తుండగా.. OE24.TVకి చెందిన మార్విన్ బెర్గౌర్ అనే రిపోర్టర్ ఈ ఘటనను కవర్ చేశాడు. అతను ఆ నిరసనకు సంబంధించిన రిపోర్టింగ్ అంతా జర్మనీలోనే చేశాడు. కాని కొందరు మాత్రం ఈ వార్తను ఎడిట్ చేసి విష ప్రచారం చేశారని వెల్లడైంది.
ఈ ఫేక్ వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వేలల్లో లైకులు, రీట్విట్‌లు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకి ఎవరెమన్నారో మీరూ ఓ లుక్కేయండి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం