కొత్త రకం టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించే వారిలో టెక్ ప్రియులు ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే కాస్త డిఫరెంట్‌గా కనిపించే ఫోల్డబుల్ ఫోన్‌ను వారు అమితంగా ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే భారత్‌లో మరో సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయ్యింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం (Tecno Phantom) దానిని రిలీజ్ చేసింది. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ (Tecno Phantom V Flip 5G) పేరుతో పరిచయమైన ఈ ఫోన్.. అక్టోబర్ 1 నుంచి సేల్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ధర, ఫీచర్లు ఇప్పుడు చూద్దాం.
ఫోన్ స్క్రీన్
Tecno Phantom V Flip 5G ఫీచర్లను గమనిస్తే ఈ 5జీ ఫోన్‌లో 6.9 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. పైన 1.32 అంగుళాల సర్క్యులర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇక్కడి నుంచే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఈ మొబైల్‌కి మీడియాటెక్ 8050 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 13.5 OSతో ఇది వర్క్ చేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంకి రెండేళ్ల వరకు అప్‌డేట్స్ పొందవచ్చు.
కెమెరా క్వాలిటీ
Tecno Phantom V Flip స్మార్ట్‌ఫోన్‌ను డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 64MP ప్రైమరీ సెన్సార్, 13MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 32MP కెమెరాను ఫిక్స్ చేశారు.
బ్యాటరీ
టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీ మెుబైల్‌కు 4,000mAh బ్యాటరీని అమర్చారు. దీనికి 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీని సాయంతో ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
స్టోరేజ్ సామర్థ్యం
ఈ మెుబైల్‌ను భారీ స్టోరేజ్ కెపాసిటీతో తీసుకొచ్చారు. 8GB RAM + 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని అందించారు. దీనిలో ఉన్న మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే 8GB ర్యామ్‌ను రెట్టింపు స్థాయికి అంటే 16GB వరకు పెంచుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్.. 5 జీతోపాటు వైఫై 6, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కలిగి ఉంది. క్లామ్‌షెల్ డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడనుంది.
కలర్స్
Tecno Phantom V Flip స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. ఐకానిక్ బ్లాక్, మిస్టిక్ డాన్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
అక్టోబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఆ రోజే దీని ధరపై క్లారిటీ రానుంది. అయితే ఈ ఫోన్ రూ.50 వేల వరకూ ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్ల కంటే తక్కువ ధరకే వస్తుండటంతో దీనిని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!