• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tecno Pova 5 Series: స్టైలిష్ డిజైన్‌, బెస్ట్ ఫీచర్స్‌తో వస్తున్న టెక్నో స్మార్ట్‌ఫోన్‌.. ధర కూడా తక్కువే..!

    చైనీస్ మొబైల్ కంపెనీ ‘టెక్నో’ భారత మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. గతేడాది డిసెంబర్‌లో టెక్నో పోవా 4 సిరీస్‌ని లాంఛ్ చేసిన టెక్నో.. ఈ సారి 5 సిరీస్‌ని విడుదల చేసింది. ఇండియాలో ధర, స్పెసిఫికేషన్లను రివీల్ చేస్తూ మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెక్నో పోవా5 (TecnoPova 5), టెక్నో పోవా 5 ప్రో 5G(Tecno Pova 5 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌లను లాంఛ్ చేసింది. మరి, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్న ఈ మోడళ్ల ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందామా. 

    డిజైన్

    డిజైన్ పరంగా టెక్నో పోవా 5 సిరీస్ స్టైలిష్‌గా కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ ప్రత్యేకంగా అమర్చిన ‘ఆర్క్ ఇంటర్‌ఫేస్’(Arc Interface) ఆకర్షణీయంగా ఉంది. బ్యాక్ ప్యానెల్ కింద ఎల్‌ఈడీలను అమర్చారు. డిఫరెంట్ కలర్స్‌లో ఇవి మెరుస్తాయి. ఛార్జింగ్ చేసే సమయంలో ఒక విధంగా, బూటింగ్ అయ్యేటప్పుడు మరొక విధంగా, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇంకో రకమైన కలర్‌లో ఫ్లాష్ అవుతుంది. ఫోన్‌లో మ్యూజిక్ వింటున్న సమయంలోనూ ఈ ఎల్‌ఈడీ ప్రత్యేకంగా ఫ్లాష్ అవుతుంటుంది. చీకటి గదిలో ఇది మరింత ప్రకాశ వంతంగా కనిపిస్తుంది. వీటిని కస్టమైజ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే, దీనిని చూడాలంటే ఫోన్‌ని వెనక్కి తిప్పాల్సి ఉంటుంది. నథింగ్ ఫోన్‌లోనూ ఇలాంటి డిజైన్‌నే చూశాం. 

    డిస్ ప్లే

    టెక్నో పోవా 5 సిరీస్ 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినేషన్ ప్లస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ రిఫ్రెష్ రేటు 120Hzగా ఉంది. మరోవైపు, టచ్ సాంప్లింగ్ రేట్ 240Hzతో వస్తోంది. రెండు మోడళ్లకు ఒకే డిస్‌ప్లే ఉండనుంది. 

    కెమెరా

    టెక్నో పోవా 5 సిరీస్‌ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు AI లెన్స్, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ వస్తోంది. ఇందులో అల్ట్రా వైడ్ లెన్స్ లేదు. ఇక బేస్ వేరియంట్ టెక్నో పోవా 5లో సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉండనుంది. టెక్నో పోవా 5 ప్రో మోడల్‌ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

    పర్ఫార్మెన్స్

    చిప్‌సెట్ విషయంలో టెక్నో పోవా 5 మోడల్ టెక్నో పోవా 4 మోడల్‌ని అనుసరిస్తోంది. మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ ఇందులో ఉండనుంది. ఇక, టెక్నో పోవా 5 ప్రో మోడల్‌లో పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ని ఇందులో వాడారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మల్టిపుల్ టాస్క్‌లను సాఫీగా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 వర్షన్‌లో HiOS లేయర్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది.

    స్టోరేజ్

    టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో 5G మోడళ్లు ఒకే RAMతో వస్తున్నాయి. రెండు మోడళ్లలోనూ 8GB RAM ఉంది. బిల్ట్ ఇన్‌గా 128 GB స్టోరేజ్‌తో వస్తోంది. 8GB RAMతోనే 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

    బ్యాటరీ

    బ్యాటరీకి టెక్నో అధిక ప్రాధాన్యత ఇస్తుంది. టెక్నో పోవా 5 సిరీస్‌లోనూ దీనిని కొనసాగించింది. టెక్నో పోవా 5 బేస్ వేరియంట్‌లో 6000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది. టెక్నో పోవా 5 వేరియంట్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. టెక్నో పోవా 5 ప్రో 5G 5000mAh కెపాసిటీతో వస్తోంది. 68వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది.

    కలర్స్

    టెక్నో పోవా 5 ప్రో 5G రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంది. డార్క్ ఇల్యూసన్స్(Dark Illusions), సిల్వర్ ఫాంటసీ(Silver Fantasy) రంగుల్లో లభ్యమవుతోంది. ఇక, టెక్నో పోవా 5ని యాంబర్ గోల్డ్(Amber Gold), హరికేన్ బ్లూ(Hurricane Blue), మెకా బ్లాక్(Mecha Black) రంగుల్లో పొందవచ్చు. 

    ధర

    ఆగస్ట్ 22 నుంచి ఇండియా మార్కెట్లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. టెక్నో పోవా 5 మోడల్ ధర రూ.11,999గా నిర్ధారించింది. వటెక్నో పోవా 5 ప్రో 5G ధర రూ.14,999 నుంచి ప్రారంభం అవుతోంది. రూ.1000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తోంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ సేల్ జరగనుంది. 

    NOTIFY ME

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv