టెక్నో తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన టెక్నో స్పార్క్ 30C ని తాజాగా భారత మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఈ ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా ఉండి, ప్రీమియమ్ ఫీచర్లు, మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది. 5000mAh బ్యాటరీ, 48MP కెమెరా మరియు గరిష్ఠంగా 128GB వరకు స్టోరేజీ వంటి ఆకర్షణీయ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్‌కి అదనంగా వర్చువల్‌గా కూడా 4GB వరకు ర్యామ్ పొడిగింపు అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 కంటే తక్కువగా ప్రారంభమవుతోంది. మరి మీరు ఈ స్మార్ట్ ఫొన్‌పై ఓ లుక్ వేయండి.
డిస్‌ప్లే& డిజైన్:
ఈ టెక్నో స్పార్క్ 30C 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD (720 x 1600 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీప్రెష్ రేట్ ఉండటం వలన స్క్రోల్ చేయడంలో, వీడియోలు చూడడంలో ఇది మెరుగైన అనుభవం ఇస్తుంది. డిజైన్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇది మూడు ఆకర్షణీయ రంగుల్లో – అరోరా క్లౌడ్, అజుర్ స్కై, మరియు మిడ్‌నైట్ షాడో అందుబాటులో ఉంది.
ప్రాసెసర్ & స్టోరేజీ:
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది, ఇది 4GB ర్యామ్‌తో పాటు 128GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. అదనంగా, ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్‌ను 4GB వరకు పెంచుకునే అవకాశం కలిగి ఉంది. ఇక స్టోరేజీని మైక్రో SD కార్డు ద్వారా గరిష్టంగా 1TB వరకు విస్తరించవచ్చు.
కెమెరా ఫీచర్లు:
48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది, అలాగే వెనుక వైపున LED ఫ్లాష్‌తో పాటు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది, ఇది మంచి క్వాలిటీ ఫోటోలను అందించడంలో సహాయపడుతుంది.
బ్యాటరీ -ఛార్జింగ్:
5000mAh సామర్థ్యంతో ఈ ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది, అలాగే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. రెండు స్టీరియో స్పీకర్లు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో రావడం వల్ల, వినియోగదారులు సౌండ్ అనుభవాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
కనెక్టివిటీ
5G, 4G, బ్లూటూత్, వైఫై, NFC, మరియు USB-C ఛార్జింగ్ పోర్టులతో పాటు, ఈ ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ మరియు IP54 రేటింగ్ ఉంది. ఇవి ఈ స్మార్ట్‌ఫోన్‌ను డస్ట్ మరియు స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి.
ధర
టెక్నో స్పార్క్ 30C 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.