ప్రస్తుతం ఐదవ సీజన్ దిగ్విజయంగా జరుపుకుంటున్న తెలుగు బిగ్ బాస్ ప్రస్థానం నాలుగేళ్ల నుండి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇక గత నాలుగేళ్లలో ఆట ఎలా జరిగింది? ఏ సీజన్ లో ఏమేం విశేషాలు ఉన్నాయి? ఏది బెస్ట్ సీజన్ అన్నది చూసేద్దామా…?
సీజన్ – 1 తారక్ తళతళ
బిగ్ బాస్ మొదటి సీజన్ 16 జూలై 2017 లో మొదలైంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఆ సమయంలో బిగ్బాస్ ఇంటి సెట్ కూడా లోనావాలలో నిర్మించడం జరిగింది ఈ సీజన్లో 71 ఎపిసోడ్ లు ఉన్నాయి. మొత్తం 16 మంది హౌస్మేట్స్ ఉన్న ఈ సీజన్ 70 రోజులపాటు జరిగింది. ఈ సీజన్ విన్నర్ గా శివ బాలాజీ నిలవగా ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ స్థానంలో నిలిచాడు. ఇక ఎన్టీఆర్ అయితే ది బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నాడు.
సీజన్- 2 కౌశల్ ఆర్మీ హవా
ఇక బిగ్ బాస్ 2 సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పటివరకు అత్యధిక ఎపిసోడ్లు జరుపుకున్న బిగ్బాస్ సీజన్ ఇదే కావడం గమనార్హం. ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో 113 ఎపిసోడ్ లు జరిగాయి. 18 మంది హౌస్ మేట్స్ ఉన్న ఈ సీజన్ 112 రోజులపాటు జరిగింది. ఈ సీజన్ తోనే ‘కౌశల్ ఆర్మీ’ అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. కౌశల్ ఎలాంటి పోటీ లేకుండా విజయం సాధిస్తే… గీతామాధురి రెండవ స్థానంలో నిలిచింది..
సీజన్ 3 నాగార్జున ఎంట్రీ
బిగ్ బాస్ 3 సీజన్ కు తొలిసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. 17 మంది కంటెస్టెంట్ లతో 106 ఎపిసోడ్ లు జరుపుకున్న ఈ సీజన్ 105 రోజులపాటు కొనసాగింది. ఇక రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ సాధించిన ఈ సీజన్ లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఇప్పటివరకు పోటాపోటీగా జరిగిన సీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఎవరు గెలుస్తారో అనే విషయంపై ఎవరికీ సరైన అవగాహన లేకపోవడం ఈ సీజన్ స్పెషాలిటీ. ఈ సీజన్ లో తొలిసారి వరుణ్ సందేశ్, అతని భార్య వితిక వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భార్యాభర్తల జంటగా నిలిచారు.
సీజన్ 4 కొత్త స్టార్స్ పుట్టుకొచ్చారు…!
ఇక గత సంవత్సరం జరిగిన నాలుగో సీజన్ విషయానికి వస్తే ఇందులో కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ నుండే 19 మంది హౌస్మేట్స్ ఇంట్లోకి రావడం మొదలైంది. 106 ఎపిసోడ్లు ఉన్న ఈ సీజన్ 105 రోజులపాటు జరిగింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ అభిజిత్ విన్నర్ గా నిలిచిన ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ రన్నరప్ గా నిలిచాడు. అయితే అభిజిత్ కు మాత్రం పాతిక లక్షల ప్రైజ్ మనీ, ఒక బైక్ లభించడం గమనార్హం. ఈ సీజన్ తో అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ వెలుగులోకి వచ్చారు
మొత్తం ఐదు సీజన్లను ఒకసారి చూసుకుంటే మొదటి సీజన్ ఒకటే లోనావాలా లో జరిగింది. మిగిలిన నాలుగు సీజన్లు హైదరాబాద్ లోనే జరిగాయి. గత మూడు సీజన్ల నుండి నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి సీజన్ కు ప్రైజ్ మనీ 50 లక్షలే ఉండడం గమనార్హం. ఇక మొదటి సీజన్ నుండి ఈ షో ‘స్టార్ మా’ ఛానల్ లోనే టెలికాస్ట్ అవుతూ వస్తోంది.
TRP రేటింగ్ ల విషయానికి వస్తే నాలుగో సీజన్ లో సీజన్ లాంచర్ TRP రేటింగ్స్ అత్యధికంగా 18.5 నమోదయ్యాయి. ఇక అత్యల్పంగా నాని హోస్ట్ గా ఉన్న రెండవ సీజన్ లో 15.05 గా నమోదుకాగా… ఫైనల్ TRP రేటింగ్స్ విషయానికి వస్తే అది కూడా నాలుగవ సీజన్ లోనే అత్యధికంగా 21.7 నమోదు కాగా అత్యల్పంగా ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మొదటి సీజన్లో 14.23 గా నమోదయింది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!