2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్ – కలెక్షన్స్ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu)
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
ఆయ్ (Aay)
నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్ చిత్రం ‘ఆయ్’ (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్ కూడా కలుపుకుంటే ‘ఆయ్’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ & ఫ్యూచరిక్ జానర్లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ వంటివారు స్పెషల్ క్యామియోలతో అలరించారు.
టిల్లు స్క్వేర్ (Tillu Square)
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు.
హనుమాన్ (Hanuman)
తేజసజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్ క్రేజ్‌తో ప్రశాంత్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టనున్నారు.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!