టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మెుదలైంది. సముద్రం నేపథ్యం ఉన్న సినిమాలు గత కొంత కాలం నుంచి విరివిగా తెరకెక్కుతున్నాయి. తీర ప్రాంత కథలతో వచ్చే సినిమాలకు సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండటంతో సీనియర్లతో పాటు యంగ్ హీరోలు తీర ప్రాంత కథల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే కొత్త డైరెక్టర్లతో కూడా పని చేసేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన, రాబోతున్న చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
దేవర
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం ‘దేవర(Devara like movies)’. కొరటాల శివ దర్శకత్వంలో సముద్రపు బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన మూవీ గ్లింప్స్‌లో తారక్ సముద్రపు దొంగల్ని ఊచకోత కోస్తాడు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తండేల్’(Thandel). ఇందులో చైతూ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజైన మూవీ గ్లింప్స్ అదిరిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్లిన జాలర్లు పొరపాటున పాక్ జలాల్లోకి ప్రవేశించి వారి చేతికి చిక్కుతారు. వారి బారి నుంచి ఏ విధంగా బయటపడ్డారు? అన్నది మూవీ స్టోరీ. దర్శకుడు చందూ మెుండేటి ప్రేమ కథ, దేశ భక్తి అంశాలను జోడించి ఈ సినిమాను కమర్షియల్‌గా తీస్తున్నారు.
ఓజీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ(OG MOVIE)’. ఈ సినిమా కూడా ముంబయి సముద్ర తీరం చుట్టూ తిరగనుంది. సముద్రంలో జరిగే అక్రమ రవాణాకు సంబంధించి కథ సాగనున్నట్లు తెలిసింది. ఇందులో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్ ప్రధాన పాత్రుల పోషించనున్నారు.
మట్కా
వరుణ్ తేజ్ హీరోగా, కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మట్కా’. ఈ మూవీ కూడా తీర ప్రాంత నేపథ్యంతో సాగనుందని సమాచారం. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ ఘటన ఆధారంగా మట్కా రూపొందుతోంది. ఈ మూవీలో వరుణ్ విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
KGF 3
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో కన్నడ స్టార్ యష్ హీరోగా రూపొందిన చిత్రం ‘కేజీఎఫ్’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే కేజీఎఫ్ 3 సముద్ర నేపథ్యంలో ఉంటుందని చెబుతున్నారు.
RC16
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘RC 16’. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆ తర్వాత RC16ను పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రం కూడా తీర ప్రాంత నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
వాల్తేరు వీరయ్య
గతేడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సముద్రంలో చేపలు పట్టుకునే గంగపుత్రుడి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించాడు. ఇందులో రవితేజ పోలీసు ఆఫీసర్‌గా నటించి సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా చేసింది.
ఉప్పెన
సముద్రపు బ్యాక్‌డ్రాప్‌తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఉప్పెన(Uppena)’. పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మత్సకార కుటుంబానికి చెందిన పేదింటి యువకుడు పాత్రలో వైష్ణవ్ నటించాడు. వ్యాపార వేత్త శేషారాయణం (విజయ్ సేతుపతి) కూతురు బేబమ్మగా కృతి శెట్టి కనిపించింది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
ఘాజీ
1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథే ఘాజీ(Ghazi). రానా, కేకే మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ లీడ్ రోల్స్‌లో నటించారు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రానికి కె. కృష్ణ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
మహా సముద్రం
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘మహాసముద్రం’. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ, అను అమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో చేశారు. తీర ప్రాంత నగరం వైజాగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడింది.