స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ – పూరి కాంబోలోని ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ – హరిష్ శంకర్ కలయికలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్ హీరో విక్రమ్ చేసిన ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నటించిన ‘ఆయ్’ అదే రోజున రిలీజయ్యాయి. అయితే రవితేజ, రామ్ చిత్రాలపై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా హైప్ వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత అవి అందరి అంచనాలను తలకిందులు చేశాయి. కలెక్షన్ల పరంగా నిరాశ పరిచాయి. మరోవైపు ‘తంగలాన్’, ‘ఆయ్’ చిత్రాలు మాత్రం హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నాయి. మరి ఆ నాలుగు చిత్రాల 4 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ మూవీ అత్యధిక వసూళ్లతో ముందజలో ఉంది? వంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
దారుణంగా మిస్టర్ బచ్చన్ వసూళ్లు!
మాస్ మహారాజా రవితేజ (Raviteja), హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhaghyshri Borse) జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan). ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రిలీజైన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో తొలిరోజు దారుణమైన కలెక్షన్స్ చవిచూసింది. వరల్డ్ వైడ్‌గా రూ.5.3 కోట్లు (GROSS) మాత్రమే రాబట్టింది. ఇక రెండో రోజు రూ.1.75 కోట్లు, మూడోరోజు కూడా ఆ స్థాయిలోనే వసూళ్లు రాబట్టింది. నాలుగో రోజుకు వచ్చే సరికి ఈ మూవీ కలెక్షన్స్ కోట్ల నుంచి లక్షల్లోకి పడిపోయాయి. వరల్డ్ వైడ్‌గా రూ.65 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఫలితంగా ‘మిస్టర్ బచ్చన్’ తొలి నాలుగు రోజుల కలెక్షన్స్ రూ.7.50 కోట్లకు మాత్రమే చేరాయి.
డిజాస్టర్ దిశగా ఇస్మార్ట్ కలెక్షన్స్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్గా చేసింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ తొలి రోజు రూ.12.45 కోట్లు (GROSS) రాబట్టి పర్వాలేదనిపించింది. అయితే నెగిటివ్ టాక్ చుట్టేయడంతో ఈ సినిమా కలెక్షన్స్ పడిపోతూ వస్తున్నాయి. రెండు రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.2.25 కోట్లను మాత్రమే డబుల్ ఇస్మార్ట్ రాబట్టింది. మూడు, నాలుగు రోజుల్లో వరుసగా రూ.1.5 కోట్లు, రూ.1.9 కోట్ల గ్రాస్ సాధించింది. తొలి నాలుగు రోజుల్లో డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ రూ.16 కోట్లకు చేరాయి.
తంగలాన్ 4 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్ ఇండియన్ స్టార్ విక్రమ్ హీరోగా దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కించిన ‘తంగలాన్’ కూడా ఆగస్టు 15న రిలీజ్ అయ్యింది. కే.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం తొలిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా తొలిరోజు రూ.26.44 కోట్లు (GROSS) రాబట్టింది. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో సాలిడ్ వసూళ్లను సాధించి తొలి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నార్త్‌లో రిలీజ్ కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతోంది. ఇక నార్త్‌లో ఈ నెల 30న తంగలాన్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచి మౌత్ టాక్‌తో దూసుకెళ్తున్న తంగలాన్ ఈ వారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
లాభాల్లోకి అడుగుపెట్టిన ‘ఆయ్’..!
తారక్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆయ్’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన ‘ఆయ్’ వాటికి దీటుగా నిలబడి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.2 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజూ అదే జోష్‌ను కొనసాగించింది. మూడో రోజు రూ.1.20 కోట్లు సాధించిన ‘ఆయ్’ నాల్గో రోజు అంతకంటే ఎక్కువగా రూ.1.46 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఫలింతంగా తొలి నాలుగు రోజుల్లో రూ.7.20 కోట్ల వసూళ్లు సాధించి లాభాల్లోకి అడుగుపెట్టిన తొలి పంద్రాగస్టు మూవీగా ఆయ్ నిలిచింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలేనని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం