• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తొలి కేబుల్‌ రైల్వే వంతెన.. ఎన్ని ప్రత్యేకతలో?

    భారత్‌లో తొలి కేబుల్‌ రైల్వే వంతెన సిద్ధమైంది. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూలోని రైసీ జిల్లాలో అంజీ ఖడ్‌ నదిపై దీన్ని నిర్మించారు. 11 నెలల వ్యవధిలో ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం పూర్తిచేసినట్లు రైల్వే మంత్రి ట్విటర్‌ వేదికగా తెలిపారు. దీనిని 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు చెప్పారు. తీగల అమరిక పనులకు సంబంధించిన [వీడియో](url)నూ ఈ సందర్భంగా మంత్రి పోస్ట్‌ చేశారు. కాగా, సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. ఈ బ్రిడ్జ్‌ పొడవు 725 మీటర్లుగా ఉంది. నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv