వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే 17-18 మంది ప్లేయర్ల జాబితాను సిద్ధం చేశామని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. వరల్డ్ కప్‌నకు ముందే పలు కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తాము కొంతమంది ప్లేయర్ల పేర్లు సిద్ధంగా ఉంచుకున్నామని, గాయపడిన ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఆధారంగా తుది నిర్ణయానికి వస్తామన్నారు. అయితే గాయాల వల్ల జట్టుకు మరీ ఇబ్బంది లేదని, ఇప్పటికీ జట్టు బాగానే ఉందని ద్రావిడ్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచకప్ జరగనుంది. భారత్ వేదికగా జరుగుతుండటంతో టీమిండియాపై భారీ అంచనాలుంటాయి. అందుకోసమే అత్యుత్తమమైన జట్టును ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019లో న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టారు. ఈసారి ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నారు. స్వదేశంలో జరుగుతుండటం కలిసొచ్చే అంశం.
జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనే దానిపై భారీగానే కసరత్తులు జరుగుతున్నాయి. రోహిత్, కోహ్లీ, గిల్, సూర్య కుమార్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్‌లకు చోటు దక్కవచ్చు. ఇందులో కూడా తదుపరి జరిగే మ్యాచుల్లో వాళ్ల ఆటతీరుపై ఆధారపడి ఉంటుంది.
ఐపీఎల్ కూడా ఇక్కడ కీలకం కానుంది. మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుంది. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి అవకాశం దక్కవచ్చు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. పోయినసారి పూర్తిగా ఐపీఎల్ ప్రదర్శనపై ఆధారపడి ఎంచుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే టీమిండియాను గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. స్టార్ బౌలర్ బుమ్రా సర్జరీ కారణంగా ఆడతాడో లేదో తెలీదు. అటు పంత్ కూడా రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు దూరమయ్యాడు. ఇటీవల ఆసీస్‌తోటెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్. అతడికి కూడా శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది. వాళ్లు ఫిట్‌నెస్ సాధించడంతో పాటు సరైన ఆటతీరు కనబరిస్తేనే ఛాన్స్ ఉంటుంది.
కొద్దిరోజుల్లో ఐపీఎల్ జరగనుండగా అందులో ఎవరైనా గాయాలపాలైతే టీమిండియా చిక్కుల్లో పడుతోంది. అందుకే ముఖ్యమైన ఆటగాళ్లు ఐపీఎల్ ఆడకూడదని సీనియర్లు సలహా ఇస్తున్నారు. మరోవైపు ఆటగాళ్ల ఫామ్ కూడా కలవరపెడుతోంది. సూర్య కుమార్ వరుసగా మూడు డకౌట్లు, కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటం బౌలర్లు నిలకడగా రాణిస్తున్నా కీలక సమయాల్లో విఫలమవుతున్నారు. మరోవైపు మిడిలార్డర్ సమస్య మరింత తీవ్రంగా వేధిస్తోంది. మరీ ఇలాంటి సమయాల్లో జట్టులో ఎవరుంటారో చూడాలి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!