గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
కీడా కోలా
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్, రాగ్‌మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మా ఊరి పొలిమేర 2
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
విధి
రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
12 ఫెయిల్
విక్రాంత్ మస్సే హీరోగా విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్’. మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఘోస్ట్
కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
స్కంద
యంగ్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ‘స్కంద’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Title | Category | Language | Platform | Release Date |
P.I. Meena | Web Series | Hindi | Amazon Prime | Nov 3 |
Scam 2003 ; Part-2 | Web Series | Hindi | Sony LIV | Nov 3 |
Are You Ok Baby? | Movie | Tamil | Aha | October 31 |
Locked In | Movie | English | Netflix | Nov 1 |
Jawan | Movie | Hindi | Netflix | Nov 2 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్