‘Thrift Stores’ అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? సరే మీకు సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయని తెలుసు కదా..? కార్లు, బైకులు, గ్యాడ్జెట్లు,అంతెందుకు పుస్తకాలు కూడా సెకండ్ హ్యాండ్ వి వాడుతుంటాం. మరి సెకండ్ హ్యాండ్ బట్టల గురించి ఎప్పుడైనా విన్నారా? అవును ఆ సెకండ్ హ్యాండ్ బట్టలను అమ్మే thrift stores ఇపుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
కొద్దిగా వాడిన లేటెస్ట్ డిజైన్లు ఉన్న బట్టలు తీసుకొని వచ్చి అన్నిటినీ ఒకచోట చేర్చి… వాటిని అమ్మెందుకే ఒక అధునాతమైన స్టోర్ నిర్మిస్తే దానినే thrift store అంటారు
కొత్తవీ పెట్టేస్తారు..!
ముఖ్యంగా ఆడవారి దుస్తులు ఉండే ఈ thrift stores లో ఎన్నో వెరైటీ లు, ఎన్నో బ్రాండ్లు, మరెన్నో సరికొత్త డిజైన్లు ఉన్న బట్టలు అందుబాటులో ఉంటాయి. వాటిని ముందు కొన్న వారికి అవసరం లేకపోవచ్చు కానీ మీకు మాత్రం అవి పర్ఫెక్ట్ గా నప్పవచ్చు. వీటితో పాటు కొత్త బట్టలు కొన్న వారు రంగు నచ్చకో, సైజు సరుపోకో మరే ఇతర కారణాల వల్ల అయినా thrift stores లో వాటిని పెట్టేస్తుంటారు.
ఆ ఆలోచన ఉంటే… ఇదే బెస్ట్
అతి తక్కువ ధరకు బ్రాండెడ్ బట్టలను అతి భారీ డిస్కౌంట్ తో పొందేందుకు thrift stores కంటే మంచి మార్గం లేదు. ఈ రోజుల్లో డబ్బును ఎంత తెలివిగా ఖర్చు పెట్టాలి… బ్రాండెడ్ బట్టలు వేసేవారు, వాతావరణం గురించి ఆలోచించేవారు ఈ thrift stores ను సందర్శించడం ఎంతో మెరుగైన నిర్ణయ
హైదరాబాదులోనూ ఉన్నాయి…
దాదాపు భారతదేశంలోని ప్రతి ప్రధాన నగరంలోనూ ఈ thrift stores ఉన్నాయి. ఇక హైదరాబాదులోనే రెండు thrift stores (thethriftedcloset_hyd, thethriftshop.hyd)
దుస్తులే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్, ఫర్నిచర్ వంటివెన్నో ఎక్కడ దొరుకుతాయి. ఆన్ లైన్ లో నే కాకుండా నేరుగా స్టోర్ కి వెళ్లి అవి ఎంత బాగున్నాయో కూడా చూసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు? దగ్గర్లోని thrift store ను స్సందర్శించండి లేదా ఇంస్టాగ్రామ్ లో చూసుకొని ఆర్డర్ చేయండి. ఇక సరికొత్త లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోండి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి