• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Debut Actress in 2023​: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్‌ వీరే!

    ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్‌ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం. 

    ఆషికా రంగనాథ్‌ 

    కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్‌’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.

    ప్రియా భవాని శంకర్‌

    తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్‌ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్‌ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్‌ అప్‌కమింగ్‌ మూవీ ‘అహం బ్రహ్మాస్మి’ లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్‌ ‘భారతీయుడు-2’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.  

    టీనా శిల్పరాజ్ 

    ‘రైటర్‌ పద్మభూషణం’ సినిమా ద్వారా టీనా శిల్పరాజ్‌ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది.

    రెబా మోనికా జాన్‌

    ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది. 

    గీతిక తివారి

    రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అహింస’. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

    ఐశ్వర్య మీనన్‌

    నిఖిల్‌ హీరోగా చేసిన ‘స్పై’ (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్‌ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్‌ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్‌ ఫాసిల్‌ హీరోగా చేస్తున్నాడు.

    యుక్తి తరేజా

    కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్‌ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

    సాక్షి వైద్య

    యంగ్‌ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి.

    ప్రగతి శ్రీవాస్తవ

    ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన చిత్రం ‘పెద్ద కాపు’. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్‌ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది. 

    నుపుర్‌ సనన్‌

    బాలీవుడ్‌ బ్యూటీ నుపుర్ సనన్‌ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది. 

    వైష్ణవి చైతన్య

    బేబి చిత్రం ద్వారా ‘వైష్ణవి చైతన్య’ (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్‌ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్లు చేసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv