వంటగదిలో కొన్ని వస్తువులు, సామగ్రి తప్పనిసరిగా ఉండాలి. వంట చేసే సమయంలో వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా పని ముందుకు కదలదు. రైస్ కుక్కర్, హాట్ బాక్స్, పోపు డబ్బాల వంటివి నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఇవి లేకుంటే కిచెన్ బోసిపోతుంది. అయితే, చాలా మంది కిచెన్‌లో విలువైన వస్తువులను వాడాలని ప్రయత్నిస్తారు. హై ఎండ్ సామగ్రి కొనుగోలు చేయాలని చూస్తారు. వాస్తవానికి అలాంటివేమీ అక్కర్లేదు. బేసిక్ టూల్స్‌తో సులువుగా వంటను పూర్తి చేసుకోవచ్చు. మరి, మీ కిచెన్‌లో ఈ వస్తువులు ఉన్నాయో? లేదో చెక్ చేసుకోండి. అవసరమైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి.
నాన్ స్టిక్ ప్యాన్/ వోక్(Non Stick Pan)
కూరలు వండే సమయంలో అజాగ్రత్తగా ఉంటే వంట చెడిపోతుంది. పోపు మాడిపోతుంది. ఫలితంగా అది కూర రుచిపై ప్రభావం చూపుతుంది. సాధారణ పాత్రలు వాడితే ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి పరిష్కారం నాన్ స్టిక్ ప్యాన్. ఇందులో వండితే కూర మాడిపోదు. ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉండటంతో పోపుని మాడిపోకుండా చూసుకుంటుంది. అమెజాన్‌లో తక్కువ ధరకే నాన్ స్టిక్ కుక్‌వేర్ సెట్ లభిస్తుంది.
పోపు డబ్బాలు (Storage Containers)
ఇంగ్రేడియంట్స్, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి పోపు డబ్బాలు ఉపయోగ పడతాయి. అయితే ఈ పోపు డబ్బాలు వివిధ పరిమాణాల్లో లభ్యమవుతుంటాయి. స్టోరేజీ కెపాసిటీకి అనుగుణంగా వాటిని ఎంచుకోవచ్చు. పోపు డబ్బాల్లోనూ వివిధ రకాలు ఉంటాయి. ప్లాస్టిక్, స్టీల్, వుడెన్, గాజు రూపాల్లో పోపు డబ్బాలు ఉంటాయి. మీ అభిరుచికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం ముఖ్యమని భావించే వారు ప్లాస్టిక్ డబ్బాలను ఎంచుకోక పోవడమే మంచిది. కాకపోతే, తక్కువ ధరలో, ఎక్కువ కాలం మన్నికనిచ్చేవి ప్లాస్టిక్‌వే.
సాస్ ప్యాన్ (Saucepan)
కాస్త పలుచగా చేసుకునే కూరలను వండటానికి సాస్ ప్యాన్ బాగా ఉపయోగ పడుతుంది. పాస్తా, చిక్కుడు వంటి కూరగాయలను ఉడకబెట్టుకోవడానికి ఇది పనికొస్తుంది. అవసరాన్ని బట్టి పరిమాణాన్ని ఎంచుకోవచ్చు. బిగ్, మీడియం సైజుల్లో ఉండే వాటిని తరచుగా వాడుతుంటారు. ఏవైనా సూప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వీటిని వినియోగిస్తుంటారు. గుడ్లను సైతం ఉడకబెట్టుకోవచ్చు. వీటిల్లోనూ నాన్ స్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి రకాలున్నాయి.
రైస్ కుక్కర్(Rice Cooker)
రైస్ కుక్కర్ వచ్చాక చాలా ఇళ్లలో అన్నం గ్యాస్‌పై వండుకోవడం కనుమరుగైంది. సమయాన్ని, శ్రమను ఇది ఆదా చేస్తుంది. సరైన పాళ్లలో బియ్యం, నీటిని పోసి కుక్కర్‌లో పెట్టేస్తే అన్నం అయిపోతుంది. అన్నం ఉడకగానే దానంతట అదే ఆఫ్ అవుతుంది. గంజి వార్చే పని కూడా ఉండదు. రైస్ కుక్కర్‌తో పాటు ప్రెషర్ కుక్కర్‌లను సైతం వినియోగిస్తుంటారు. పప్పు, నాన్ వెజ్ వంటి వాటిని ఈ ప్రెషర్ కుక్కర్‌లలో వండేందుకు ప్రాధాన్యత ఇస్తారు. మీకు కావాల్సిన కెపాసిటీని బట్టి ఆన్‌లైన్‌లో వీటి ధరలు ఎలా ఉన్నాయో కింద ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేయండి.
BUY NOW(Rice Cooker)
Buy Now(Pressure Cooker)
జ్యూస్ మేకర్/బ్లెండర్(Juice Maker)
జ్యూస్ మేకర్, బ్లెండర్‌లు, మిక్సి చాలా సమయాన్ని ఆదా చేస్తాయి. బయటి ఖర్చులను తగ్గిస్తాయి. వీటితో పండ్ల రసాలు చేసుకోవచ్చు. మసాలాలను సిద్ధం చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వంటి పేస్ట్‌లను ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద సైజులో ఉన్నవాటిని చిన్నగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వివిధ రకాలైన జ్యూస్ మేకర్లు, మిక్సిలు, బ్లెండర్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు.
ఫ్రిజ్(Fridge)
ఆహార పదార్థాలను నిల్వ చేసుకునేందుకు ఫ్రిజ్ అవసరం పడుతుంటుంది. ఆహార పదార్థాలను పాడవకుండా ఇది కాపాడుతుంది. ఇతర పానీయాలను స్టోర్ చేసుకోవడానికి ఫ్రిజ్ పనికొస్తుంది. ఐస్‌ని తయారు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. అయితే, ఇదేమీ తప్పనిసరి కాదు. కానీ, ఉంటే పలు రకాలుగా ఉపయోగపడుతుంది. మీ అవసరాన్ని బట్టి వివిధ కంపెనీలకు చెందిన ఫ్రిజ్‌లను ఎంచుకోవచ్చు.
మైక్రోవేవ్ ఓవెన్/ హాట్ బాక్స్(Microwave Oven)
చల్లారిన పదార్థాలను వేడి చేయడానికి మైక్రో వేవ్ ఓవెన్ ఉపయోగ పడుతుంది. ఆహార పదార్థం చెడిపోకుండా తక్కువ సమయంలో వేడి చేసుకోవచ్చు. దీంతో పాటు హాట్ బాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. వేడి పదార్థాల ఉష్ణోగ్రతను తాత్కాలికంగా పరిరక్షిస్తాయి.
కట్టింగ్ బోర్డ్(Cutting Board)
కూరగాయలు, ఇతర పదార్థాలను కట్ చేయడానికి కట్టింగ్ బోర్డ్ అవసరం. చాలా మంది ఇది లేకుండానే ప్లేట్లలో కట్ చేస్తుంటారు. అయితే, అది సురక్షితం కాకపోవచ్చు. కట్టింగ్ బోర్డ్ నీట్‌గా ఉంటుంది. పైగా, చాకు పదును కూడా తగ్గకుండా ఉంటుంది.
కొలతలు(Measuring Cups/Spoons)
కూర వండే సమయంలో ఏ ఇంగ్రేడియంట్ ఎంత వేయాలనే కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొంతమంది ఒక అంచనాతో వేస్తుంటారు. అయితే, రుచి పర్‌ఫెక్ట్‌గా సెట్ కావాలంటే కొలత పాటించాలి. కాబట్టి, కొలిచే పరికరాలు ఇందుకు ఉపయోగ పడతాయి.
ఇతర ముఖ్యమైన వస్తువులు
తురుము పీట(Grater), చాకులు, చిమ్మట(Tongs) , పక్కడ్వంటివి కూడా వంటగదిలో ముఖ్యమే. వీటిని కూడా అమెజాన్‌లో తక్కువ ధరకే పొందవచ్చు.