• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Top 5 Budget 5G Mobiles: రూ.15 వేలలోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

  ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌లో కొత్త ఒరవడి ప్రారంభమైంది. ప్రతీ ఒక్కరు 5G మెుబైల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు అన్నీ అత్యాధునిక ఫీచర్స్‌తో 5G ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో 5G ప్రియులు ఆలోచనల్లో పడుతున్నారు. 4G ధరకే 5G ఫోన్‌ లభిస్తుందా అని తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.15 వేల లోపున్న అత్యుత్తమ 5G ఫోన్లను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటి వివరాలు, ఫీచర్స్‌, ధర ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేసింది. అవేంటో మీరూ చూడండి. 

  రెడ్‌మీ 11 ప్రైమ్ 

  ప్రముఖ మెుబైల్ తయారీ కంపెనీల్లో చైనాకు చెందిన ‘రెడ్‌మీ’ ఒకటి. ఈ కంపెనీ నుంచి రూ.15 వేల లోపు 5G ఫోన్‌ కావాలనుకునే వారు ‘రెడ్‌మీ 11 ప్రైమ్’ (Xiaomi Redmi 11 Prime 5G) ఫోన్‌ ట్రై చేయోచ్చు. దీంట్లో 6.58 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 700 ప్రొసెసర్‌, 4GB RAM/64GB ఇంటర్నల్‌ మెమోరీ ఉంది. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ తీసుకొచ్చారు. అమెజాన్‌లో రూ.14,999కు ఈ ఫోన్‌ లభిస్తోంది. 

  BUY NOW

  శాంసంగ్‌ గెలాక్సీ M13 

  శాంసంగ్‌ నుంచి కూడా అత్యాధునిక 5G మెుబైల్స్‌ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. రూ.15 వేల లోపు 5G ఫోన్‌ కావాలనుకుంటే ‘శాంసంగ్‌ గెలాక్సీ M13’ (Samsung Galaxy M13) మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ. 11,999 ధరకే అమెజాన్‌లో ఈ ఫోన్ ‌అందుబాటులో ఉంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు, 50MP+2MP డ్యూయల్ కెమెరా, 5MP సెల్పీ కెమెరా, 5000mAH బ్యాటరీ ఉన్నాయి. అలాగే 4GB+64GB, 6GB+128GB వేరియంట్లతో ఈ ఫోన్ లభిస్తోంది.

  BUY NOW

  ఐకూ జెడ్‌ 6 లైట్

  ప్రముఖ మెుబైల్‌ కంపెనీ ఐకూ కూడా తక్కువ ధరకే ఐకూ జెడ్‌ 6 లైట్ (iQOO Z6 Lite 5G) ఫోన్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌ ఈ కామర్స్‌ సంస్థ ఈ ఫోన్‌ను రూ.13,999 విక్రయిస్తోంది. దీంట్లో 6.5 అంగుళాల స్క్రీన్‌తో పాటు, స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌1 ప్రొసెసర్‌, 4GB RAM/64GB మెమోరీ, 50MP+2MP డ్యూయల్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీని కూడా ఫోన్‌కు అమర్చారు. 

  BUY NOW

  లావా బ్లేజ్

  ప్రముఖ దేశీయ కంపెనీ లావా నుంచి కూడా తక్కువ ధరకే 5G ఫోన్ అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ (Lava Blaze 5G) ఫోన్‌ రూ.10,999కే అమెజాన్‌లో సేలింగ్‌ అవుతోంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డిమెన్సిటీ 700 ప్రొసెసర్‌, 4GB RAM/128GB ఇంటర్నల్‌ స్టోరేజీ, 50MP+2MP+VGA బ్యాక్‌ కెమెరా సెటప్‌, 8MP సెల్పీ కెమెరా ఉంది. అలాగే 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ తీసుకొచ్చారు.

  BUY NOW

  రియల్‌మీ 9ఐ

  రియల్‌మీ నుంచి కూడా realme 9i 5G ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ సెల్లింగ్‌ ప్రైస్‌ రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లేతో పాటు, మీడియాటెక్‌ డిమెన్సిటీ 810 ప్రొసెసర్‌, 6GB RAM/64GB ROM, 48MP+2+2ఎంపీ బ్యాక్‌ కెమెరా, 16MP ఫ్రంట్‌ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంది. 

  BUY NOW

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv