ల్యాప్‌టాప్‌లో బిగ్ స్క్రీన్ ఒక అడ్వాంటేజ్. స్మార్ట్‌ఫోన్‌లో పోర్టేబులిటీ ఒక అడ్వాంటేజ్. ఈ రెండింటిని కలిపి అందించేదే ట్యాబ్లెట్ లేదా ట్యాబ్. ప్రస్తుతం గ్యాడ్జెట్ ప్రియులు ట్యాబ్‌లపై ఫోకస్ పెడుతున్నారు. అటు వినోదం పొందడానికి, ఇటు పని చేసుకోవడానికి ట్యాబ్ బాగా పనికొస్తుంది. ఇలా బహువిధాలా ఉపయోగపడే ట్యాబ్లెట్లు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లతో గ్యాడ్జెట్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే, బడ్జెట్ ధరలోనే మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చిన ట్యాబ్‌లకు భలే డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో రూ.30 వేల లోపు లభించే టాప్ 5 ట్యాబ్‌లేంటో చూద్దాం.
Realme Pad X
భారీ బ్యాటరీ బ్యాకప్‌తో రియల్‌మీ ప్యాడ్ ఎక్స్(Realme Pad X) ట్యాబ్ అందుబాటులోకి వస్తోంది. 8340mAh బ్యాటరీ దీని సొంతం. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 695 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్ రూపుదిద్దుకుంది. ఆండ్రాయిడ్ 12 వర్షన్ ప్లాట్‌ఫారంపై రియల్‌మీ UI 3.0 లేయర్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది.
7.1మిల్లీమీటర్ల మందం కలిగి ఉంటుంది. బరువు కూడా తక్కువే. కేవలం 507 గ్రాముల బరువు ఉంటుంది. కానీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆడియో జాక్ దీనికి లేవు. స్టోరేజ్‌కి సంబంధించి ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4GB RAM+128GB స్టోరేజ్; 6GB RAM+128GB వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్ ధర రూ.27,999.
Lenovo Tab M10
రూ.30 వేల లోపు లభించే మరో బెస్ట్ ట్యాబ్లెట్ లెనోవో ట్యాబ్ ఎమ్10. రౌండెడ్ ఎడ్జెస్ ఉండటంతో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 10.71 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే మంచి అనుభూతిని కలిగిస్తుంది. 7700mAh కెపాసిటీతో బ్యాటరీ వస్తోంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 4GB, 6GB RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6GB RAM వేరియంట్ ధర రూ.26,999.
Xiaomi Mi Pad 6
మిడ్ రేంజ్ ట్యాబ్‌లలో షావోమీ ఎమ్ఐ ప్యాడ్ 6 మంచి స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్‌ని అందించే స్నాప్‌డ్రాగన్ 870 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోంది. 6GB RAM+ 128GB స్టోరేజ్; 8GB RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తోంది. డాల్బి విజన్ అండ్ అట్మాస్ సపోర్ట్ చేయనుంది. అదనంగా ఆప్షనల్ ప్యాడ్ కీబోర్డ్ యాక్సెసరీ వస్తోంది. స్మార్ట్ పెన్ వెసులు బాటు కూడా ఉంది. క్వాడ్ స్పీకర్ సిస్టంతో ఆడియో స్పష్టంగా వినబడుతుంది. 8840mAh కెపాసిటీతో బ్యాటరీ వస్తోంది. టాప్ ఎండ్ ధర రూ.28,999.
Samsung Galaxy Tab S6 Lite
కంప్లీట్ ప్యాకేజీతో సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ వస్తోంది. 10.4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లేతో డ్యుయల్ స్పీకర్ సెటప్ ఉంది. డాల్బీ అట్మాస్‌తో స్ట్రీమింగ్ ఫెసిలిటీ అత్యద్భుతంగా ఉండనుంది. సామ్‌సంగ్ ఎక్సినోస్ 9611(Exynos 961) చిప్‌సెట్‌ని ఇది కలిగి ఉంది. కంటెంట్ స్ట్రీమింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇది భలే సరిపోతుంది. 7040mAh కెపాసిటీతో కూడిన బ్యాటరీ ఉంది. 4GB RAM+ 64GB స్టోరేజ్ వేరియంట్ దీని ధర రూ.27,999.
Nokia T20
భారత్‌లో నోకియా టాబ్లెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వైఫై, 4G+ వైఫూ వేరియంట్లు ఉన్నాయి. కేవలం వైఫై సపోర్ట్ చేసే వేరియంట్లో రెండు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 3GB RAM+ 32GB స్టోరేజ్; 4GB RAM + 64GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఇక 4Gతో సపోర్ట్ చేసే వేరియంట్ 4GB RAM+ 64GB స్టోరేజీని కలిగి ఉంది. 10.4అంగుళాల డిస్‌ప్లేని ఇది కలిగి ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!