ఏటా ఎన్నో మొబైల్ ఫోన్లు మార్కెట్లో రిలీజ్ అవుతుంటాయి. కస్టమైజ్డ్ ఫీచర్స్‌తో మొబైల్ ప్రియులను ఇంప్రెస్ చేస్తుంటాయి. ఫీచర్స్ పరంగా ఒక్కో బ్రాండ్ ఒక్కో తరహా కస్టమర్‌ని ఆకర్షిస్తుంటుంది. అయితే, అన్ని రకాల ఫీచర్లతో ముస్తాబై సగటు మొబైల్ లవర్స్‌ని సంతృప్తి పరుస్తూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే స్మార్ట్‌ఫోన్లు కొన్నే ఉంటాయి. మరి, ఈ ఏడాదిలో ఆగస్ట్ నాటికి మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లేంటో తెలుసుకుందాం.
iPhone 14 Pro Max
ఐఫోన్ సిరీస్‌లో హై ఎండ్ వేరియంట్ ఇది. అత్యద్భుత ఫీచర్లతో ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది. డైనమిక్ ఐలాండ్‌తో పాటు క్రాష్ డిటెక్షన్, సాటిలైట్ కనెక్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీని సొంతం. అందుకే మార్కెట్లో దీనికి ఫుల్ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా, A16 బయోనిక్ చిప్‌సెట్‌తో ఇది రూపుదిద్దుకుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. 4X రిజల్యూషన్ గల 48మెగా పిక్సెల్ కెమెరా దీని సొంతం. 128GB, 256GB, 512GB, 1TB.. నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.
Google Pixel 7 Pro
పిక్సెల్ 7 ప్రో బలమైన టెన్సార్ G2 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. మొబైల్ మార్కెట్‌లో ఐఫోన్‌కి బలమైన పోటీదారుగా నిలుస్తోంది. స్పెసిఫికేషన్ల విషయంలో కొన్నింటిలో ఐఫోన్‌ని దాటేసింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా, 12MP కెమెరాలతో ఈ ఫోన్ తెగ అట్రాక్ట్ చేస్తోంది. 120Hz సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్‌ని కలిగి ఉందిది. 12GB RAM, 128GB స్టోరేజ్‌ని ఇది అందిస్తోంది.
Samsung Galaxy S23 Ultra
ఐఫోన్, పిక్సెల్ ఫోన్లకు శాంసంగ్ పోటీగా నిలుస్తోంది. ఇంప్రెసివ్ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. 200 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో మొబైల్ ప్రియులను మెస్మరైజ్ చేస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో తయారైంది. 6.8 అంగుళాల సూపర్ అమోల్డ్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో అట్రాక్ట్ చేస్తోంది. 5000mAh బ్యాటరీ కెపాసిటీతో ఇది వస్తోంది.
OnePlus 11 5G
పర్ఫార్మెన్స్ పరంగా వన్ ప్లస్ బెస్ట్ ఫోన్‌గా నిలుస్తోంది. ఇందులో కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంది. కెమెరా విషయంలోనూ వన్‌ప్లస్ రాజీ పడట్లేదు. రియర్ కెమెరాలో అత్యంత మన్నికైన సోనీ ఐఎమ్ఎక్స్ సెన్సార్లున్నాయి. తక్కువ వెలుతురులోనూ మెరుగ్గా ఫొటోలు తీసేందుకు ఈ సెన్సార్లు ఉపయోగ పడతాయి. 5000mAh బ్యాటరీతో పాటు 100వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.7అంగుళాల భారీ డిస్‌ప్లేని ఇది కలిగి ఉంది. 8GB/16GB RAM, 128/256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది.
Xiaomi 13 Pro
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ 13 ప్రో బెస్ట్ ఫోన్‌గా పోటీ పడుతోంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 6.73 అంగుళా E6 అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో ప్రధాన ఆకర్షణ కెమెరా సెటప్. 50 మెగా పిక్సెల్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ దీని సొంతం. ఐఎంఎక్స్989 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా, టెలిఫోటో మ్యాక్రోతో రెండో కెమెరా, అల్ట్రా వైడ్ లెన్స్‌తో మూడో కెమెరా సెటప్ అయి ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. 12GB RAM, 256GB మెమొరీ దీని సొంతం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!