ప్రస్తుత కాలంలో ప్రింటర్ల (Printers) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ ప్రింటర్లు.. ప్రస్తుతం ఇళ్లల్లోనూ తప్పనిసరిగా మారిపోయారు. పిల్లల హోమ్‌వర్క్, ప్రాజెక్ట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాల దృష్ట్యా చాలా మంది ప్రింటర్లను తమ ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. ఇక కొత్తగా ప్రింటర్స్ కొనేవారికి అమెజాన్ బంపరాఫర్లు ప్రకటించింది. టాప్ బ్రాండెడ్ బడ్జెట్ ప్రింటర్లను పండగ సేల్ (Great Indian Festival)లో భాగంగా భారీ తగ్గింపుతో అందిస్తోంది. అమెజాన్‌లో రూ.5,000 లోపు అమ్ముడవుతున్న ప్రింటర్స్‌లో బెస్ట్ జాబితాను YouSay మీ ముందుకు తెచ్చింది. వాటి విశేషాలేవో ఇప్పుడు చూద్దాం.
HP Deskjet 2723 Printer
ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్. బ్లాక్ అండ్ వైట్, కలర్ కాపీలను చాలా స్పష్టంగా తీస్తుంది. వైఫై, బ్లూటూత్, USB ద్వారా ఈ ప్రింటర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. HP Smart App ద్వారా ఈ ప్రింటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీని అసలు ధర రూ.7,006. అమెజాన్ సేల్‌లో ఇది 36% డిస్కౌంట్‌తో రూ.4,499 అందుబాటులోకి వచ్చింది.
Canon Pixma E410
ఇది ప్రింట్ (Print), స్కాన్ (Scan), కాపీ (Copy) వంటి ప్రధాన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ప్రింటర్ ద్వారా కలర్, బ్లాక్ & వైట్ జిరాక్స్‌లను చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. తక్కువ బరువు ఉండటం వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి దీనిని ఈజీగా తరలించవచ్చు. అమెజాన్‌లో ఈ ప్రింటర్ 27% డిస్కౌంట్‌తో రూ.4,299 లభిస్తోంది.
HP Deskjet 2331 Colour Printer
దీనిని ప్రత్యేకించి కలర్ ప్రింట్ కోసమే రూపొందించారు. ఈ ప్రింటర్‌ను కూడా HP Smart App ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇల్లు, ఆఫీసులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. దీని అసలు ధర రూ.4,971. అమెజాన్ పండగ సేల్‌లో ఇది 34% డిస్కౌంట్‌తో రూ.3,299 అందుబాటులోకి వచ్చింది.
Canon PIXMA MG2577s
ఈ Canon ప్రింటర్.. గ్రేట్ ఇండియన్ సేల్‌లో 20% రాయితీతో లభిస్తోంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.3,875. అమెజాన్ ఈ ప్రింటర్‌ను 20% డిస్కౌంట్‌తో రూ.3,099 అందిస్తోంది. దీని సాయంతో A4, A5, B5 సైజ్ కలర్, బ్లాక్ & వైట్ పేపర్ ప్రింట్లను తీసుకోవచ్చు.
Canon Pixma TS207
తక్కువ బడ్జెట్‌లో ప్రింటర్‌ను కోరుకునేవారు దీన్ని పరిశీలించవచ్చు. ఈ ప్రింటర్ ద్వారా ప్రతీది ప్రింట్ తీసుకోవచ్చు. Canon Pixma TS207 ప్రింటర్ అసలు ధర రూ.2,695. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఈ ప్రింటర్ 18% తగ్గింపుతో రూ.2,199 అందుబాటులోకి వచ్చింది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!