• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Trisha Krishnan: టాలీవుడ్‌పై కన్నేసిన త్రిష.. ఆ విషయంలో యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీ!

  స్టార్‌ నటి త్రిష (Actress Trisha).. నాలుగు పదుల వయసులోనూ యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల తమిళంలో విజయ్‌ (Vijay) సరసన ‘లియో’ (Leo)లో నటించిన త్రిష.. మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’లోని కనిపించి మెప్పించింది. రీసెంట్‌గా తెలుగులో చిరంజీవి భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’లోనూ త్రిష హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. తాజాగా టాలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ త్రిషను వరించినట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 

  ఆ స్టార్‌ పక్కనే నటించనుందా!

  టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh) కాంబోలో తెరకెక్కిన ‘F2’, ‘F3’ చిత్రాలు ఆడియన్స్‌ను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఆ చిత్రాల్లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. అదే నిజమైతే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో మళ్లీ మంచి మెుదలైనట్లే. గత కొంత కాలంగా డబ్బింగ్‌ సినిమాలతోనే టాలీవుడ్‌కు పరిమితమైన త్రిష.. ‘విశ్వంభర’ ద్వారా నేరుగా తెలుగు సినిమా చేసే అవకాశం దక్కించుకుంది. అయితే వెంకటేష్‌ – త్రిష కాంబోకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

  సూపర్‌ హిట్‌ కాంబో..!

  వెంకటేష్‌ – త్రిష గతంలోనూ జంటగా నటించారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ‘నమో వెంకటేశ’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబినేషన్‌ చాలా బాగుందంటూ అప్పట్లో టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు ‘బాడీగార్డ్‌’ సినిమాతో మరోమారు జతకట్టారు. వీరి కెమెస్ట్రీకి మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆ చిత్రం విఫలమైంది. దీంతో అప్పటి నుంచి వెంకీ – త్రిష కాంబినేషన్‌లో మరో చిత్రం రాలేదు. తాజా ప్రచారం ప్రకారం వీరు మళ్లీ జోడి కడితే ఇది వారికి నాల్గో చిత్రం అవుతుంది. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చిత్రం కావడంతో ఈ జోడీ తెరపై ఎలాంటి సందడి చేస్తుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే పెరిగిపోయాయి. 

  త్రిష క్రేజీ ప్రాజెక్ట్స్‌

  త్రిష అటు తెలుగుతో పాటు.. తమిళంలోనూ మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ అజిత్‌ (Ajith)తో కలిసి ‘విడా ముయరాచి’ (Vidaa Muyarchi) అనే సినిమాలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life)లో కూడా త్రిష హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. అలాగే మలాయళ స్టార్‌ మోహన్‌లాల్‌ (Mohanlal)తో ‘రామ్‌’ (Ram) అనే సినిమాలోనూ ఈ బ్యూటీ కనిపించింది. దాంతోపాటు ‘ఐడెంటిటీ’ అనే మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తూ ఈ సుందరి బిజీ బిజీగా గడుపుతోంది. 

  పరువు నష్టం దావా

  ఇటీవల తమిళనాడు ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజు.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై వ్యక్తిత్వహననానికి పాల్పడ్డాడు. త్రిష.. రూ.25 లక్షలు తీసుకుని ఓ రిసార్ట్ లో గడిపేందుకు వచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా త్రిష న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. అంతకుముందు ఏవీ రాజు వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv