• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • True Lover Movie Review: ప్రేమికులకు అద్దం పట్టే అందమైన చిత్రం.. ఎలా ఉందంటే?

    నటీనటులు: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి తదితరులు..

    దర్శకుడు : ప్రభురామ్ వ్యాస్

    సంగీతం: సీన్ రోల్డన్

    సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ

    ఎడిటింగ్: భరత్ విక్రమన్

    నిర్మాతలు: నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్

    విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2024

    మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్రూ లవర్’ (True Lover). ప్రభురామ్‌ వ్యాస్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ చిత్రం ‘లవర్‌’ పేరుతో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇవాళ ట్రూ లవర్‌ పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? తమిళంలో లాగే ఇక్కడ కూడా విజయాన్ని అందుకుందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథ

    అరుణ్ (మణికందన్), దివ్య (గౌరి ప్రియ) (True Lover Movie Review In Telugu) కాలేజీ రోజుల నుంచి లవర్స్‌. దివ్య ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తుండగా.. అరుణ్‌ ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తాగుడుకు అలవాటై జీవితాన్ని టైం పాస్‌ చేస్తుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు మెుదలవుతాయి. తోటి ఉద్యోగస్తులతో దివ్య క్లోజ్‌గా ఉండటాన్ని అరుణ్‌ సహించలేక పోతాడు. ఆ తర్వాత ఏమైంది? అరుణ్‌ – దివ్య కలిశారా? విడిపోయారా? కాఫీ కేఫ్‌ పెట్టాలన్న హీరో కల నెరవేరిందా? లేదా? అన్నది మిగిలిన కథ. 

    ఎవరెలా చేశారంటే

    నటీనటుల విషయానికి వస్తే.. మణికందన్‌ (True Lover Movie Review In Telugu) మంచి నటన కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి హావా భావాలను పలికించాడు. సగటు ప్రేమికుడ్ని తలపించేలా చక్కటి నటన కనబరిచాడు. అతడి కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక దివ్య పాత్రలో గౌరి ప్రియ జీవించింది. తెరపై వీరిద్దరి కెమెస్ట్రీ మెప్పిస్తుంది. ఇక కన్నా రవితో పాటు మిగిలిన ప్రధాన పాత్రదారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    ఈ జనరేషన్‌ ప్రేమలను కథాంశంగా తీసుకొని డైరెక్టర్‌ ప్రభురామ్ వ్యాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. చిన్న చిన్న అపార్థాలు, అపోహలతో లవర్స్‌ ఎలా గొడవపడతారు? మళ్లీ అంతలోనే ఎలా కలుస్తారు? అన్న కోణంలో కథను రాసుకున్న తీరు మెప్పిస్తుంది. వాస్తవ పరిస్థితులను, కుర్రాళ్ల భావోద్వేగాలను డైరెక్టర్ సినిమాలో చక్కగా ప్రెజెంట్‌ చేశారు. అయితే కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం కొన్ని చోట్ల చాలా సింపుల్‌గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే ఆసక్తిగా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లు రెగ్యూలర్‌గా అనిపిస్తాయి. కొన్ని ఓవర్‌ డ్రామా సీన్లు సినిమాకు మైనస్‌గా మారాయి. మెుత్తంగా వ్యాస్‌ డైరెక్షన్‌ బాగున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

    టెక్నికల్‌గా..

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే (True Lover Movie Review In Telugu).. మ్యూజిక్‌ డైరెక్టర్‌ సీన్ రోల్డన్ అందించిన పాటలు బాగున్నాయి. కొన్ని సీన్లలో వచ్చే నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. ఎడిటర్ భరత్ విక్రమన్ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేది.  ఇక శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. . నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

    ప్లస్ పాయింట్స్‌

    • కథా నేపథ్యం
    • మణికందన్‌, గౌరీ ప్రియ నటన
    • యువతకు నచ్చే కొన్ని సీన్లు

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సీన్లు
    • సెకండాఫ్‌ స్క్రీన్‌ ప్లే

    Telugu.yousay.tv Rating : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv