సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.
తండేల్
నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు ‘తండేల్’ (Thandel). ఈ సినిమా టైటిల్ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్
ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘సలార్’ (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డంకీ (DUNKI)
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కానుంది.
తంగలాన్
చియాన్ విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.
కంగువ
స్టార్ హీరో సూర్య అప్‌కమింగ్ మూవీ పేరు ‘కంగువ’ (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
మట్కా
వరణ్‌తేజ్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు ‘మట్కా’ (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది.
జిగర్‌తండ డబుల్ ఎక్స్
రాఘవ లారెన్స్, ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్‌తండ డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
అయలాన్
శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘అలయాన్’ (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్