కొత్త ఏడాదిలో తమ నూతన మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు సిద్ధమయ్యాయి. ద్విచక్ర వాహన రంగంలో పెద్ద ఎత్తున వినియోదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆ బైక్స్‌ను ఫిబ్రవరి, మార్చిలో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏ ఏ బైక్స్ రాబోతున్నాయి. వాటి ప్రత్యేకతలు ఏంటి? ధర ఎంత వరకూ ఉండవచ్చు? వంటి కీలక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Suzuki V-Strom 800DE
సుజూకి నుంచి మరో పవర్‌ఫుల్ బైక్ ఈ నెలలో రాబోతోంది. Suzuki V-Strom 800DE బైక్ ఫిబ్రవరి 17న లాంచ్ అయ్యే అవకాశముంది. ఇది 776 cc ఇంజిన్, 6 స్పీడ్ మ్యానువల్స్, 20 లీటర్ల ఫుయల్ ట్యాంక్ వంటి ఫీచర్లతో లాంచ్ కానుంది. దీని ధర కూడా రూ.11-12లక్షల మధ్య ఉంటుందని ఆటోమెుబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ బైక్ లాంగ్ రైడ్ వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.
Lectrix ECity Zip
Lectrix ECity Zip మోడల్‌లో వస్తున్న మరో ఎలక్ట్రిక్ బైక్ ఇది. పట్టణాల్లో రోజువారి పనులుకు ఈ బైక్ అత్యంత అనువైంది. ముఖ్యంగా లేడీస్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని తయారు చేసినట్లు కనిపిస్తుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ 45Kmph కాగా, బ్యాటరీ ఛార్జింగ్ టైం 5 గంటలుగా ఉంది. దీని ధర రూ.80,000-90,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 28న లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
KTM 125 Duke 2024
యూత్‌లో యమ క్రేజ్‌ను సంపాదించిన బైక్ KTM 125 Duke. దీనిని మార్చి1న లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ బైక్ 14.7 bhp సామర్థ్యం కలిగిన 124.9 cc ఇంజిన్‌తో రానుంది. 6 స్పీడ్ మ్యానువల్స్ ఇందులో ఉండనున్నాయి. ఈ బైక్.. న్యూ డిజైన్ స్ట్రైకింగ్ లుక్స్‌తో గతంలో వచ్చిన మోడల్స్ కంటే అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఈ సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నింటికీ ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ధర రూ.1,75,000 – 1,80,000 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Royal Enfield Roadster 450
రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌తో రానుంది. Royal Enfield Roadster 450 పేరుతో మార్చి 5న ఈ కొత్త సూపర్ బైక్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ 450 cc ఇంజిన్, 6 స్పీడ్ మ్యానువల్స్, 13.8 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంక్, 40bhp గరిష్ట పవర్ టార్క్, 17-ఇంచ్ అలై ట్యూబ్ లెస్ వీల్స్ రానున్నాయి. హెడ్ లైట్‌తో పాటు, టెయిల్ లైట్స్ సైతం ఫుల్ LED సెటప్‌తో రానున్నాయి. దీని ధర రూ.2,40,000-2,60,ల వరకూ ఉంటుందని సమాచారం.
Honda CBR300R
ఈ రేసులో హోండా కూడా తన నయా బైక్‌ను తీసుకురానుంది. హోండా సీబీఆర్300R పేరుతో మార్చి 13న మార్కెట్లోకి లాంచ్ చేసేందకు సిద్ధమైంది. ఈ బైక్ 286cc ఇంజిన్ కెపాసిటీ, 6 స్పీడ్ మ్యాన్యువల్, 30bhp టార్క్ పవర్‌తో రానుంది. అలాగే ఈ సెగ్మెంట్లో లైట్ వెయిట్, గ్రేట్ బ్రేకింగ్ పర్ఫామెన్స్ దీనిని కచ్చితంగా ముందు వరుసలో నిలబెడుతాయి. రెండు వైపుల డిస్క్ బ్రేక్స్, ప్యుయెల్ ఇంజెక్ట్‌డ్ సాంకెతికత, 13 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటితో బైక్ రానుంది. ఇక దీని ధర రూ.2,00000- రూ.2,29,999 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
Bajaj Pulsar 400
బజాజ్ కంపెనీ నుంచి మరో సూపర్ బైక్ లాంచ్ కానుంది. పల్సర్ 400 పేరుతో మార్కెట్లోకి మార్చి 15న విడుదలన కానున్నట్లు తెలుస్తోంది. 373cc ఇంజిన్, సింగిల్ సిలిండర్‌తో రానుంది. 39.4bhp టార్క్ సామర్థ్యంతో ఇంజిన్ పనిచేయనుంది. ముందు, వెనుక వైపు ఎల్‌ఈడీ లైట్ సెటప్‌తో పాటు ABS బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండనున్నట్లు తెలిసింది. ఇక దీని ధర రూ.2-రూ.2.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tork Kratos X
ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ముఖ్యంగా యూత్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది. మార్చి 27న మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టార్క్ క్రాటోస్, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కేటీఎం డ్యూక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ బైక్ ముందు వెనుక అట్రాక్టివ్ ఎల్‌ఈడీ లైట్స్‌ను అమర్చారు. ఫెయిర్ సీటింగ్‌తో పాటు అగ్రెషన్ లుక్‌తో యూత్‌ను ఇట్టే ఆకర్షించే స్టైల్ దీని సొంతం. దీని ధర రూ. 1,80,000- 1,90,000 మధ్య ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Hero Xoom 160
ప్రముఖ ఆటోమెుబైల్ సంస్థ హీరో (Hero) కూడా కొత్త ఏడాదికి సరికొత్త బైక్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేయనుంది.Hero Xoom 160 పేరుతో శక్తివంతమైన బైక్‌ను మార్చి 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 156cc ఇంజిన్‌తో ఈ బైక్ రానుంది. ఇది Yamaha Aerox 155, Honda Unicorn & Bajaj Pulsar NS125లకు గట్టి పోటీ ఇవ్వనుంది. లిక్విడ్ కూల్ ఇంజిన్, సిప్లిట్ ఎల్‌ఈడీ లైట్స్, ఇంధన సామర్థ్యాన్ని పెంచే i3s టెక్నాలజీ, రీమోట్ కీ ఇగ్నిషన్ వంటి ఫీచర్లతో ఇది అట్రాక్ట్ చేస్తోంది. దీని ధర రూ.1,10,000 – 1,20,000 మధ్య ఉంటుందని సమాచారం.
Celebrities Featured Articles Telugu Movies
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!