• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Mobiles In December 2023: డిసెంబర్‌లో రిలీజయ్యే టాప్‌ కంపెనీల మెుబైల్స్‌ ఇవే..!

    ప్రతీ నెలా టాప్‌ కంపెనీల మెుబైల్స్‌ రిలీజ్‌ అవుతూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్‌లోనూ ప్రముఖ సంస్థల ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మెుబైల్‌ ప్రియుల నిరీక్షణను పటాపంచలు చేస్తూ లాంచ్‌ కాబోతున్నాయి. దిమ్మతిరిగే ఫీచర్లతో దేశీయ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇంతకీ ఆ మెుబైల్స్ ఏవి? వాటి ధర, ఫీచర్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    Redmi Note 13 Pro Plus

    రెడ్‌మీ మరో అద్భుతమైన మెుబైల్‌ను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయబోతోంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro Plus)ను లాంచ్‌ చేయనుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే, 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం. మిడ్‌రేంజ్ 4nm డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్ ఫోన్‌లో ఉండవచ్చు. ఈ మెుబైల్ ధర రూ.23,190 వరకూ ఉండొచ్చని అంచనా. 

    OnePlus 12

    వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్.. డిసెంబర్ 4న చైనాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ 12 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 6.7 అంగుళాల 2K రిజల్యూషన్ OLED డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ LYT-808 సెన్సార్‌, 5,400mAh బ్యాటరీ, 100W వైర్డు ఛార్జింగ్ బ్యాటరీ, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ కెపాసిటీ వంటి స్పెసిఫికేషన్లతో ఫోన్ రానుంది. ఈ మెుబైల్ ధర రూ.80,990 వరకూ ఉండొచ్చని సమాచారం. 

    iQOO 12

    ఐకూ 12 సిరీస్‌ మెుబైల్‌ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. డిసెంబర్ 12 నుంచి భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల AMOLED స్క్రీన్‌, 144 Hz రిఫ్రెష్‌ రేట్‌, 50 MP + 50 MP + 64 MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 5000 mAh బ్యాటరీ, Android v14 OS, Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ వంటి ఫీచర్లను ఫోన్‌ కలిగి ఉంది. దీని ధర రూ. 45,790 ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 

    Honor 100

    హానర్ 100 (Honor 100) కూడా ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. ఈ డిసెంబర్‌లో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌, 6.7 అంగుళాల 1220p రిజల్యూషన్ OLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MagicOS 7.2, OISతో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ కెపాసిటీ వంటి ఫీచర్లతో ఈ హానర్‌ రాబోతోంది. ఈ మెుబైల్ ధర భారత్‌లో రూ.29,357 వరకూ ఉండవచ్చు. 

    Oppo Reno 11 Series

    చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్‌లు ఈ డిసెంబర్‌లో భారత్‌లోనూ రిలీజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 4,800mAh బ్యాటరీ, 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు దీంట్లో ఉన్నాయి. కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2x జూమ్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఈ మెుబైల్ ప్రారంభ వేరియంట్ ధర రూ.29,000 వరకూ ఉంటుందని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv