సాధారణంగా ఏటీఎం (ATM)లో నగదు విత్‌డ్రా చేయాలంటే డెబిట్, క్రెడిట్ కార్డు తప్పనిసరి. లేకుంటే కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం కచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియని పక్షంలో మనీ విత్‌డ్రా అసాధ్యం. ఈ సమస్యను అధిగమించేందుకు ‘హిటాచీ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ’ (Hitachi payment services company) యూపీఐ ఏటీఎం (UPI ATM)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను లాంచ్ చేసింది. దీన్ని ‘హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం’ అని పిలుస్తారు.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో పని లేకుండానే ఈ నయా ఏటీఎం నుంచి డబ్బులు పొందొచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2023లో ‘హిటాచీ మనీ స్పాట్ యూపీఐ ఏటీఎం’ను లాంచ్ చేశారు. కాగా, రానున్న కాలంలో ఈ ఏటీఎం చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ UPI ఏటీఎం ఎలా పనిచేస్తుంది. దీని నుంచి నగదు ఎలా డ్రా చేయాలి? ఇప్పుడు చూద్దాం.
యూపీఐ ద్వారా నగదు పొందాలంటే ముందుగా ఎంత మెుత్తం డ్రా చేయాలో నిర్ణయించుకోవాలి. తర్వాత ఏటీఎంలో యూపీఐ క్యాష్ విత్‌డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంత డబ్బు విత్‌డ్రా చేస్తున్నారో ఎంటర్ చేయాలి. అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత మీ ఫోన్‌లో యూపీఐ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. తర్వాత మీ యూపీఐ పిన్ (UPI Pin) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ కరెర్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ప్రక్రియ మెుదలవుతుంది. అది పూర్తి అయిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు వచ్చేస్తాయి.
ఈ యూపీఐ ఏటీఎంలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డెబిట్ కార్డు మర్చిపోయినా, పిన్ గుర్తులేకపోయినా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. ఫోన్ ద్వారానే క్షణాల్లో ఏటీఎం నుంచి డబ్బును పొందవచ్చు. వేరే వారికి ఫోన్‌పే (PhonePe), గూగుల్‌పే (Google Pay) వంటివి కూడా చేయాల్సిన పని లేదు. సింపుల్‌గానే ఏటీఎం నుంచి డబ్బులు పొందొచ్చు.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank og Baroda) జూన్‌లోనే తమ ఏటీఎంలలో UPI ద్వారా నగదు విత్‌డ్రా సౌకర్యాన్ని తీసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఈ బ్యాంకు ఏటీఎంలలో UPI సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ సేవలు ప్రారంభించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అప్పట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్పుకొచ్చింది.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సరికొత్త యూపీఐ ఏటీఎంను ప్రయోగాత్మకంగా పరిచయం చేసింది. యూపీఐ ద్వారా నగదు ఎలా డ్రా చేయాలో ఓ వ్యక్తి వివరించాడు. మీరే చూడండి.
అయితే యూపీఐ లావాదేవీలు సైతం ఏటీఎం విత్ డ్రాలుగానే బ్యాంక్ పరిగణిస్తుంది. మీకు ఉన్న ఏటీఎం విత్ డ్రా లిమిట్ దాటితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ యూపీఐ ఏటీఎం కేవలం భీమ్ యూపీఐ యాప్ (BHIM UPI App)పైన మాత్రమే పని చేస్తోంది. త్వరలోనే అన్ని యూపీఐ యాప్స్‌ని ఇందులోకి తీసుకురానున్నారు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!