ఫిబ్రవరి వచ్చిందంటే చాలు.. యువతరానికి ముందుగా గుర్తుకు వచ్చే తేదీ ‘ఫిబ్రవరి 14’ (February 14). ఈ డేట్ యువతకు ఎంతో స్పెషల్. కొందరు తనకు నచ్చిన వ్యక్తికి ఆ రోజున ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే.. మరికొందరు మనసుకి దగ్గరైన ప్రేమికురాలికి ఎలాంటి గిఫ్టులు ఇవ్వాలని థింక్ చేస్తుంటారు. అయితే వాలెంటైన్ డే వైబ్స్ వారం ముందు నుంచే మెుదలవుతాయి. రోజ్‌డే, కిస్ డే, ప్రపోజ్ డే అంటూ ఇలా ఫిబ్రవరి 14వరకూ వరకు యూత్ ప్రతీ రోజును సెలబ్రేట్ (Valentine Week 2024) చేసుకుంటారు. ఇంతకి ఈ వాలెంటైన్స్ వీక్‌లో ఏ రోజును ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? తెలియకుంటే వెంటనే ఓ లుక్కేయండి.
రోజ్ డే (ఫిబ్రవరి 7)
వాలెంటైన్స్ వీక్ ప్రతి ఏడాది రోజ్ డే (Rose Day)తో స్టార్ట్ అవుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎర్ర గులాబీలు ఇచ్చి రోజ్ డే రోజున వ్యక్తపరుస్తారు. ఆ రోజున చాలా మంది ప్రేమికులు ఎర్ర గులాబీలు ఇచ్చి తమ మనసులోని మాటను ప్రేమించిన వ్యక్తి తెలియజేస్తారు. మరికొందరు ఎల్లో రోజ్ ఇచ్చి తమ స్నేహాన్ని చాటుకుంటారు.
ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8)
ఎంతో గాఢంగా ప్రేమించిన వ్యక్తికి తమ మనసులోని మాటను చెప్పుకునేందుకు ఈ ‘ప్రపోజ్ డే’ (Propose Day)ను జరుపుకుంటారు. చాలా మంది తమ మదిలో గూడుకట్టుకొని ఉన్న ప్రేమ అనే అక్షరాలను మనసుకు నచ్చిన వ్యక్తి ముందు సాక్షత్కరింపజేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొ పద్ధతిలో తమ లవర్‌కి ప్రపోజ్ చేస్తుంటారు.
చాక్లెట్ డే (ఫిబ్రవరి 9)
గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచి జీవితాన్ని మధుర క్షణాలతో ప్రారంభించడానికి మూడో రోజు ‘చాక్లెట్ డే’ (Chocolate Day) నిర్వహిస్తారు. చాలా మంది ఇదే రోజు తమ ఇష్టమైన వారికి చాక్లెట్‌లను గిఫ్టులుగా ఇచ్చి వారిపై తమ ప్రేమను చాటుకుంటారు.
టెడ్డీ డే (ఫిబ్రవరి 10)
ఇష్టమైన వ్యక్తిలో సంతోషాన్ని నింపే ఉద్దేశంతో ఈ ‘టెడ్డీ డే’ (Teddy Day) నిర్వహిస్తారు. ఈ టెడ్డీ పక్కన ఉంటే మనం ప్రేమించిన వ్యక్తి మన పక్కనే ఉన్నాడని కూడ కొంతమంది ఫీలవుతారు. అందుకే యువకులు ఎక్కువగా తమ ప్రేయసికీ టెడ్డీలను బహుమతిగా ఇస్తుంటారు.
ప్రామిస్ డే (ఫిబ్రవరి 11)
జీవితాంతం (Valentine Week 2024) ఒక్కరి కోసం ఒకరం కలిసి ఉంటామని హామీ ఇచ్చే రోజును ‘ప్రామిస్ డే’ (Promise Day)గా జరుపుకుంటాం. కష్టసుఖాల్లో కూడ కలకాలం తోడుంటామని లవర్స్ ఆ రోజున ప్రామిస్ చేసుకుంటారు. తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రామిస్ డేను ఒక సెంటిమెంట్‌గా భావిస్తుంటారు.
హగ్ డే (ఫిబ్రవరి 12)
మాటల్లో చెప్పలేని భావాలను ఆత్మీయ ఆలింగనం ద్వారా చెప్పేందుకు ఈ ‘హగ్ డే’ (Hug Day) ఉద్దేశించబడింది. ఒక్క హగ్‌తో (Valentine Week 2024) మన మనసులోని ఫీలింగ్స్‌ను ఎదుటివారికి తెలియజేయచ్చని చాలా మంది నమ్మకం.
కిస్ డే (ఫిబ్రవరి 13)
వాలెంటైన్స్ డేకి సరిగ్గా ఒకరోజు ముందు ఈ ‘కిస్ డే’ (Kiss Day) జరుపుకుంటారు. ముద్దు ద్వారా మనసులోని ప్రేమను లవర్స్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. ప్రేమికులు ఈ రోజును ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.
వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)
ఇక ఫైనల్‌గా వాలైంటెన్ డే విషయానికి వస్తే ఈ రోజుకు చాలా పెద్ద చరిత్రే ఉంది. వాలెంటైన్ అనే ఒక క్రిస్టియన్ ప్రవక్త త్యాగానికి ప్రతిఫలంగా ఈ రోజును నిర్వహిస్తారు. హిస్టరీలోకి వెళితే.. క్రీ.శ.270లో రోమ్ చక్రవర్తి క్లాడియస్ యువకులు ఎవరు పెళ్లి చేసుకోరాదని చట్టాన్ని చేస్తాడు. అయితే ఆ చట్టాన్ని వాలెంటైన్ తప్పుబడతాడు. యువతీ యువకుల్లో ప్రేమను ప్రోత్సహించేలా బోధనలు చేస్తాడు. అతడి విధానాలకు ప్రభావితమై క్లాడియస్ కుమార్తె కూడ వేరే వ్యక్తి ప్రేమలో పడుతుంది. దీంతో ఆగ్రహించిన రాజు ‘ఫిబ్రవరి 14’ (Valentine’s Day)న వాలెంటైన్‌ని ఉరి తీయిస్తాడు. అతడు చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత క్రీ.శ.496లో అప్పటి పోప్ గెలాసియన్స్ అతడి త్యాగానికి గుర్తుగా ఉరి తీసిన రోజును ‘ప్రేమికుల రోజు’గా ప్రకటిస్తాడు. అయితే వాలెంటైన్స్ డేపై ఒకోక్కరికి ఒక్కో అభిప్రాయం ఉన్నప్పటికీ ఎక్కువ మంది విశ్వసించేది ఈ కథనే.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం