మెగా హీరో వరుణ్‌తేజ్ తొలి చిత్రం ముకుందతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి ఫస్ట్ ఫిల్మ్ పెద్దగా అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో అతడి కెరీర్ పరంగా తిరుగుండదని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అతడ్ని పూర్తిగా ఢీలా పడేలా చేశాయి. రీసెంట్‌గా చేసిన ‘మట్కా’ చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను వరుణ్ పట్టాలెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడిపై నెటిజన్లు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. హీరోగా మానేసి విలన్ పాత్రలు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) ‘మట్కా’ (Matka) ఫ్లాప్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వరుణ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించనున్నట్లు సమాచారం. ‘మట్కా’ షూటింగ్ దశలో ఉండగా దర్శకుడు మేర్లపాక గాంధీ కథకు సంబంధించి వరుణ్‌తేజ్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌కు వరుణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
సినిమాలకు వరుణ్ బ్రేక్!
కరుణ కుమార్ దర్శకత్వంలో ఎంతో కష్టపడి చేసిన ‘మట్కా’ ఎవరూ ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలవడం వరుణ్ తేజ్‌ను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. రొటీన్ స్టోరీ, పూర్ స్క్రీన్‌ప్లేతో అస్సలు బాలేదన్న టాక్ వచ్చింది. అయితే నటుడిగా వరుణ్ తేజ్ మాత్రం పూర్తిగా న్యాయం చేశాడన్న ప్రశంసలు కూడా వచ్చాయి. ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో వరుణ్ తేజ్ పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని వరుణ్ నిర్ణయించుకున్నారట. ఈసారి ఆడియన్స్‌ను మెప్పించే కథ రావాలని గట్టిగా ఫిక్సయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
‘విలన్‌గా చేసుకో’
వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన గత ఆరు చిత్రాల్లో ఒక్క ‘ఎఫ్ 3’ మాత్రమే మంచి విజయం సాధించింది. అది కూడా వరుణ్ తేజ్ స్ట్రైట్ ఫిల్మ్ కాదు. అందులో వెంకటేష్ కూడా చేయడంతో సక్సెస్ క్రెడిట్ పూర్తిగా వరుణ్‌కు ఇవ్వలేము. వరుస ఫ్లాప్స్‌తో అభిమానులను నిరాశ పరుస్తుండంతో వరుణ్ తేజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. స్క్రిప్ట్ మీదు అసలు శ్రద్ధ వహించడం లేదని విమర్శలు చేస్తున్నారు. మంచి హైట్, ఫిజిక్ ఉన్న నేపథ్యంలో విలన్‌గా ట్రై చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాను వరుణ్ తేజ్ ఫాలో అయితే కెరీర్ బెటర్‌గా ఉంటుందని సలహా ఇస్తున్నారు.
‘మట్కా’ ఓటీటీ రిలీజ్ లాక్
వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka OTT Release) చిత్రం 20 రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘మట్కా’ (Matka)ను వీక్షించవచ్చని తెలిపింది. కాగా ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది.
‘మట్కా’ స్టోరీ ఇదే
మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్ కథ. పాకిస్తాన్ నుంచి ముంబయికి వచ్చిన రతన్ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్ తేజ్) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’