ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ వివో (Vivo) నుంచి అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్ విడుదలకు సిద్ధమయ్యాయి. Vivo S17 Series పేరుతో వీటిని తీసుకురానున్నారు. Vivo S17, Vivo S17t, Vivo S17 Pro వేరియంట్లలో లాంచ్ చేయనున్నారు. బుధవారమే (మే 31) ఈ ఫోన్స్ చైనాలో విడుదలయ్యాయి. ఈ ఏడాది మర్చిలో విడుదలైన S17e మోడల్‌కు కొనసాగింపుగా వీవో S17 సిరీస్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలోనే ఈ ఫోన్స్‌ను భారత్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు వివో సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో Vivo S17 Series ప్రత్యేకతలు, ధర, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
Vivo S17 Series స్మార్ట్‌ఫోన్స్‌లో 6.78 అంగుళాల Full HD+( 2800 x 1260) అమోల్డ్ డిస్‌ప్లేను ఫిక్స్ చేశారు. ఇవి 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు.
ప్రొసెసర్
S17 సిరీస్‌లోని Vivo S17, Vivo S17t, Vivo S17 Pro వేరియంట్లను మూడు డిఫరెంట్ ప్రొసెసర్లతో తీసుకొచ్చారు. Vivo S17లో Qualcomm Snapdragon 778G Plus, Vivo S17tలో MediaTek Dimensity 8050 చిప్‌సెట్, Vivo S17 Proలో MediaTek Dimensity 8200 Soc ప్రొసెసర్లను అమర్చారు.
బ్యాటరీ సామర్థ్యం
S17 సిరీస్‌లోని మూడు ఫోన్లు 4,600 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బ్యాటరీని నిమిషాల వ్యవధిలో ఫుల్ చేసుకోవచ్చని వివో స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.
స్టోరేజీ సామర్థ్యం
Vivo S17, Vivo S17t, Vivo S17 Pro వేరియంట్లు 8GB RAM / 256GB ROMతో రానున్నాయి. దీంతో పాటు డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB-C పోర్ట్ వంటి కొత్త ఫీచర్లను ఈ ఫోన్స్ కలిగి ఉన్నాయి.
కెమెరా
Vivo S17, Vivo S17t మోడల్స్‌లో 50 MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరాను ఫిక్స్ చేశారు. అటు Vivo S17 Proలో IOS సపోర్టెడ్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 12 MP టెలిఫోటో పోర్టెయిట్ లెన్స్, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాలు అమర్చారు. ఇక ఫ్రంట్ కెమెరాను 16MPతో తీసుకొచ్చారు.
కలర్స్
Vivo S17 Series స్మార్ట్‌ఫోన్స్‌ను మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్లాక్, మౌంటైన్ సీ గ్రీన్, ఫ్లవర్ కలర్ వేవ్స్ సీ వంటి కలర్ ఆప్షన్స్‌లో ఫోన్స్ లభించనున్నాయి.
ధర ఎంతంటే?
Vivo S17 Series ధరలు భారత మార్కెట్‌లో ఎలా ఉంటాయో వివో ఇంకా ప్రకటించలేదు. అయితే చైనాలో Vivo S17, Vivo S17t మోడల్స్ ధర స్టోరేజీని బట్టి రూ. 29,100 – రూ.34,900 వరకు ఉంది. Vivo S17 Proను కూడా స్టోరేజీ ఆధారంగా రూ.36,100 – రూ.40,700 మధ్య విక్రయిస్తున్నారు. భారత మార్కెట్‌లో కాస్త వ్యత్యాసం ఉండొచ్చు. ధరలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!