మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ (VIVO T3 Ultra) మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన T3 మోడల్స్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వీటికి అదనంగా సరికొత్త ఫీచర్లతో వివో T3 మొబైల్(సెప్టెంబర్ 12) గురువారం మధ్యాహ్నం భారత మార్కెట్లోకి విడుదల కానుంది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం.
VIVO T3 Ultra
VIVO T3 ఫోన్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే వివో T3 సిరీస్‌లో వివో T3 5G, వివో T3 లైట్ 5G, వివో T3x 5G స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అదరగొడుతున్నాయి. ఇవి మార్కెట్లో ఉన్న OnePlus Nord CE3 Lite 5G, Redmi Note 12 5G, Moto G73 5G, iQoo Z7 5G ఫోన్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి.
డిస్ప్లే
VIVO T3 Ultra హ్యాండ్సెట్ 6.78 ఇంచెస్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లేతో రానుంది. ఈ డిస్ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 4500 Nits గరిష్ఠ బ్రైట్నెస్, HDR10+ సపోర్టు, 10 బిట్ కలర్ డెప్త్‌ను కూడా కలిగి ఉంటుంది. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ప్రూఫ్‌తో స్లీక్ డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది.
ప్రాసెసర్
T3 అల్ట్రా శక్తివంతమైన ప్రాసెసర్‌తో రానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ SoC చిప్ సెటప్ కలిగి ఉంది. ఇది వీడియో రికార్డింగ్, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించడంలో దోహదం చేస్తుంది.
మెమోరీ
వివో T3 అల్ట్రా రెండు రకాల స్టోరేజీ వేరియంట్లతో వస్తుంది.12GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఇన్‌బిల్ట్ కెపాసిటీ కలిగి ఉంటుంది.
కెమెరా
ఫోన్‌కి వెనకాల డ్యుయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 4k క్వాలిటీతో వీడియోలను రికార్డు చేయవచ్చు. మరియు Aura లైట్ రింగ్ LED ప్లాష్ తో అందుబాటులోకి రానుంది.
బ్యాటరీ
ఈ అల్ట్రా మోడల్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అయితే గతంలో వచ్చిన మోడల్స్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేసేవి. ఈసారి అల్ట్రా మోడల్లో ఇది అప్‌గ్రేడ్ అవడం విశేషం.
కలర్స్
వివో టీ3 అల్ట్రా మోడల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ రంగుల్లో ఈ గ్యాడ్జెట్ సూపర్బ్‌గా కనిపిస్తోంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా వీటిలో ఉంది.
ధర
వివో T3 అల్ట్రా మోడల్ మిడ్ రెంజ్ ప్రైస్ సెగ్మెంట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. లీక్స్ ప్రకారం దీని ధర గరిష్ఠంగా రూ.33,000- రూ.35,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ధరపై పూర్తి సమాచారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ రివీల్ చేయనుంది. ఈ సరికొత్త వివో T3 అల్ట్రా మొబైల్‌ను వివో ఇండియా ఇ-స్టోర్‌లోనూ, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్సైట్లోనూ కొనుగోలు చేయవచ్చు.