• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo V29 5G Mobile Review: వివో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. దీని ఫీచర్లకు దాసోహం అవ్వాల్సిందే..!

    భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఇందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ మొబైల్ ప్రియులను వివో తనవైపు తిప్పుకుంటోంది. కాగా, ఇటీవలే ‘వివో వీ29ఈ’ (Vivo V29e)  స్మార్ట్‌ఫోన్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఇవాళ దానికి అనుసంధానంగా మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నేటి నుంచి ‘వివో వీ29’ (Vivo V29) పేరుతో ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు వచ్చింది. మరి Vivo V29 ప్రత్యేకతలు ఏంటి? దీనిలో ఎలాంటి  ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    ఫోన్‌ డిస్‌ప్లే

    వివో వీ సిరీస్ (Vivo V Series) ఫోన్‌ల మాదిరే ‘Vivo V29’ స్మార్ట్‌ఫోన్‌ కూడా సన్నగా క్రేజీ లుక్‌తో వచ్చింది. 6.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను ఫోన్‌ కలిగి ఉంది. డిస్‌ప్లే రిజల్యూషన్ 1260 x 2800 పిక్సెల్‌ కాగా, 120Hz రిఫ్రెష్ రేట్‌ను ఫోన్‌కు అందించారు. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌తో ఇది వచ్చింది.  

    స్టోరేజ్‌ సామర్థ్యం

    ‘Vivo V29’ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వచ్చింది. 8GB RAM + 128GB ROM, 12GB + 256GB వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు. ర్యామ్‌, స్టోరేజ్‌ అవసరాన్ని బట్టి మీకు నచ్చిన వేరియంట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.  

    బ్యాటరీ

    Vivo V29 స్మార్ట్‌ ఫోన్‌ను 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. దీని సాయంతో మెుబైల్‌ను చాలా త్వరగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. కాగా, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.

    కెమెరా క్వాలిటీ

    వివో వీ29 మెుబైల్‌ను క్వాలిటీ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. బ్యాక్ కెమెరా సెటప్‌లో OISతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే LED ఫ్లాష్‌ను కూడా అందించారు. ఇక ముందువైపు ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేశారు. దీనికి ఆటో ఫోకస్ సపోర్ట్ కూడా ఉంది.

    కలర్స్‌

    వివో వీ29 రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. పీక్‌ బ్లూ (Peak Blue), నోబుల్‌ బ్లాక్‌ (Noble Black) కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.  

    ధర ఎంతంటే?

    వివో వీ29 మెుబైల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ (అక్టోబర్‌ 4) మధ్యాహ్నం 12.00 గంటలకు సేల్‌కు వచ్చింది. 8GB RAM/128 GB ROM వేరియంట్‌ ధరను కంపెనీ రూ.32,999గా నిర్ణయించింది. 12GB + 256GB మోడల్‌ రూ.36,999 ధరను కలిగి ఉంది. Axis Bank కార్డ్స్‌పై కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్‌ పొందవచ్చు. నెలకు రూ.6,167 చొప్పున ఫోన్‌పై NO Cost EMI సౌకర్యం కూడా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv