• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo V29e : వివో నుంచి మరో సూపర్బ్ స్మార్ట్ ఫొన్.. కలర్ ఛేంజింగ్ టెక్నాలజీతో యూత్‌పై ఫొకస్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    చైనీస్ స్మార్ట్ ఫొన్ దిగ్గజం వివో నుంచి మరో స్మార్ట్ ఫొన్ ఇండియాల్ లాంచ్‌ కానుంది. ఈమేరకు వివో కంపెనీ అధికారికంగా ఈనెల 28న Vivo V29e మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఆగస్టు 28 మధ్యాహ్ననం 12 గంటలకు ఫొన్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. మీడియం బడ్జెట్‌ రేంజ్‌లో రానున్న ఈ ఫొన్ ప్రత్యేకతలు, ధర, ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓసారి వాటిని పరిశీలిద్దాం.

    Vivo V29e Display:

    వివో V29e హ్యాండ్‌సెట్  3D కర్వ్డ్‌ డిస్‌ప్లేతో స్క్రీన్‌పై హోల్ పంచ్ కట్‌అవుట్ ఆప్షన్‌తో రానుంది. 6.78 ఇంచ్ పొడవుతో ఉన్న డిస్‌ప్లే 120Hz రిఫ్రేష్ రేటును కలిగి ఉంది. OLED డిస్‌ప్లే FPSను సపోర్ట్ చేస్తుంది.

    కెమెరా

    Vivo V29e మొబైల్‌లో మెయిన్ కెమెరా 64 మెగాఫిక్సెల్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా లేదా సెల్ఫీ కెమెరా 50 మెగాఫిక్సెల్ కన్ఫిగరేషన్‌తో క్వాలిటీ చిత్రాలు, వీడియో టేకింగ్‌ను అందిస్తుంది. వైడాంగిల్, నైట్ మోడ్, టైమ్ ల్యాప్స్ ఫీచర్సును కలిగి ఉంది.

    కలర్స్

    వివో V29e రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆర్టిస్టిక్ రెడ్, ఆర్టిస్టిక్ బ్లూ కలర్స్‌లో ఫొన్ అయితే ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. దీనికి అదనంగా కలర్‌ ఛేంజింగ్ గ్లాస్ ప్యానెల్ అమర్చబడి ఉంటుంది. ఈ కలర్ ఛేంజింగ్ గ్లాస్ ప్యానెల్ కేవలం ఆర్టిస్టిక్ రెడ్ కలర్ మోడల్‌కు మాత్రమే పరిమితమై ఉంటుంది. గ్యాడ్జెట్ 7.57mm మందంతో 180.5 గ్రాముల బరువుతో ఉండును.

    స్టోరేజీ:

    Vivo V29e మోడల్ రెండు వేరియంట్లలో లభించును. 8GB RAM + 128GB స్టోరేజీ సామర్థ్యంతో బేసిక్ మోడల్, 8GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లతో ప్రీమియ్ మోడల్ అందుబాటులో ఉంటుంది.

    సాఫ్ట్‌వేర్ 

    ఇది Android 13-ఆధారిత FunTouchOS 13తో నడవనుంది. ఒక స్నాప్‌డ్రాగన్ 480 5G SoC లేదా స్నాప్‌డ్రాగన్ 480+ 5G SoC ఆధారంగా పనిచేస్తుంది.

     

    బ్యాటరీ

    Vivo V29e స్మార్ట్ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.  4,600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే… రోజంతా బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

    ధర:

    మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం Vivo V29e 8GB+128GB వేరియంట్ ధర రూ.25 వేలు ఉండనుండగా.. Vivo V29e 8GB+256GB వేరియంట్ ధర రూ.30 వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది.

     

    ఆగస్టు 28 న లాంచింగ్ తర్వాత వెంటనే ఫ్లిఫ్‌కార్ట్‌లోకి సేల్స్‌కు వచ్చే అవకాశం ఉంది.  ఈ గ్యాడ్జెట్ కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లు త్వరలో వెల్లడికానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv