• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo Watch 3: వివో నుంచి మరో సరికొత్త అడ్వాన్స్‌డ్‌ వాచ్‌.. ఆశ్చర్యపరుస్తున్న ఫీచర్లు!

    దేశంలో మంచి బ్రాండ్‌ కలిగిన మెుబైల్‌ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్లకు టెక్‌ ప్రియుల్లో మంచి గుడ్‌విల్‌ ఉంది. మరోవైపు వివో అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌లను సైతం రిలీజ్‌ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. తాజాగా ఈ కంపెనీ ‘Vivo Watch 3’ పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. ‘వివో X100’ స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ వాచ్‌ను చైనాలో ఆవిష్కరించింది. 2021 డిసెంబర్‌లో విడుదల చేసిన ‘Vivo వాచ్ 2’ విజయంవంత కావడంతో ‘వివో వాచ్ 3’ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వాచ్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    వాచ్‌ స్క్రీన్‌

    ఈ స్మార్ట్‌వాచ్‌ 1.43 అంగుళాల Curved AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 466×466 pixels క్వాలిటీని అందించారు. New Blue OSతో వాచ్‌ వర్క్ చేయనుంది. 

    హెల్త్‌ ఫీచర్లు

    ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్‌ హెల్త్‌ ఫీచర్లను వివో ఇన్‌బిల్ట్‌ చేసింది. హృదయ స్పందనలను గుర్తించే ‘హార్ట్‌ రేట్‌ మానిటర్‌’, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులను పర్యవేక్షించే ‘బ్లడ్ ఆక్సిజన్‌ మానిటర్‌’ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

    స్పోర్ట్స్‌ మోడ్స్‌

    ఈ నయా వివో వాచ్‌లో క్రీడాకారులకు అవసరమైన 100కి పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ను అందుబాటులో ఉంచారు. వాచ్‌ దృఢంగా ఉండేలా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను ఉపయోగించారు. 

    బ్యాటరీ లైఫ్‌

    ‘vivo WATCH 3’ మెుత్తం రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. eSIM, Bluetooth ఆప్షన్స్‌లో లభించనుంది. 64MB RAM / 4GB స్టోరేజ్‌ను వాచ్ కలిగి ఉంది. 16 రోజుల బ్యాటరీ లైఫ్‌ను దీనికి అందించారు. 

    అడ్వాన్స్‌డ్‌ సెన్సార్లు

    ఈ వాచ్‌లో acceleration సెన్సార్‌, గైరోస్కోప్‌, ఎయిర్‌ ప్రెసర్‌ ఆల్టిట్యూడ్‌ సెన్సార్‌ (Air Pressure Altitude Sensor), జియోమాగ్నటిక్‌ సెన్సార్‌ (Geomagnetic Sensor), Ambient light Sensor, హాల్‌ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

     

    కలర్‌ వేరియంట్లు

    ఈ స్మార్ట్‌వాచ్‌ మెుత్తం నాలుగు కలర్‌ వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. బ్లాక్‌ (black), మూన్‌ లైట్‌ వైట్‌ (Moonlight white), స్టార్‌ లైట్‌ (Starlight), బ్రైట్‌ మూన్‌ (Bright moon)రంగుల్లో లభించనుంది. 

    ధర ఎంతంటే?

    ప్రస్తుతం ఈ నయా వివో వాచ్‌ చైనాలో మాత్రమే విడుదలయ్యింది. త్వరలోనే భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. అయితే ఈ వాచ్‌ దేశీయ ధరను వివో ప్రకటించలేదు. కానీ, చైనాలో నిర్ణయించిన ధరలను బట్టి Vivo watch 3 బ్లూటూత్‌ వెర్షన్‌ రూ.12,550 వరకూ ఉండనుంది. అదే విధంగా eSIM వెర్షన్‌ రూ.14,835కు సేల్‌ కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv