ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వివో (Vivo) తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. తాజాగా మరో స్మార్ట్ ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 Series)ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో అనే రెండు మోడల్స్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నయా వివో మెుబైల్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
Vivo X100 సిరీస్ మెుబైల్.. 6.78 అంగుళాల కర్వ్‌డ్ 8 LTPO AMOLED స్క్రీన్‌తో వస్తోంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. MediaTek Dimensity 9300 SoC ప్రొసెసర్, వివో V3 చిప్‌సెట్, Funtouch 14 OSపై మెుబైల్ వర్క్ చేయనుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68 రేట్‌ను కలిగి ఉంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ వివో సిరీస్.. నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 12GB RAM / 256GB ROM, 16GB RAM / 256GB ROM, 16GB RAM / 512GB ROM, 16GB RAM / 1TB స్టోరేజ్ వేరియంట్లలో మెుబైల్ లాంచ్ అవుతుందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.
బ్యాటరీ
Vivo X100 మెుబైల్‌ను 5000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీని సాయంతో మెుబైల్‌ను 11 నిమిషాల్లోనే 50% వరకూ ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
కెమెరా
Vivo X100 స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50MP OIS ప్రైమరీ కెమెరా + 64MP టెలిఫొటో + 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌ను అమర్చారు. అలాగే మెుబైల్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. వీటి సాయంతో 4K, 1080p,HDR ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ వివో ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. Wi-Fi 802.11 a/b/g/n/ac/6/7, Bluetooth 5.4, GPS, GLONASS, BDS, GALILEO వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, డిజిటల్ దిక్సూచి వంటి సెన్సార్లు కూడా ఫోన్‌కు అందించారు.
కలర్ ఆప్షన్స్
Vivo X100 సిరీస్ నాలుగు రంగుల్లో దేశీయ మార్కెట్‌లోకి రాబోతోంది. స్టార్‌ట్రైల్ బ్లూ (Startrail Blue), ఆస్ట్రాయిడ్ బ్లాక్ (Asteroid Black), తెలుపు (White), ఆరెంజ్ (Orange) కలర్ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
ధర ఎంతంటే?
Vivo X100 స్మార్ట్‌ఫోన్ల ధరలను చైనీస్ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. జనవరి 4న ఈ ఫోన్ లాంచింగ్ సందర్భంగా ధరలపై స్పష్టత రానుంది. అయితే వివో ఎక్స్100 సిరీస్‌లోని ప్రారంభ వేరియంట్ ధర రూ. 57,090 వరకు ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!