• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo Y36i Mobile: వివో నుంచి కళ్లు చెదిరే బడ్జెట్‌ ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    దేశంలో మంచి గుడ్‌విల్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే వివో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Vivo Y36i పేరుతో కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. Vivo Y36 అనుసంధానంగా దీన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    Vivo Y36i స్మార్ట్‌ఫోన్‌ను 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. దీనికి 1612 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 840 nits పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంపిలింగ్‌ రేట్‌ అందించారు. ఈ మెుబైల్‌ MediaTek Dimensity 6020 SoC ప్రొసెసర్‌, Mali-G57 MP2 జీపీయూతో వర్క్‌ చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ నయా వివో మెుబైల్‌ను 4GB RAM ర్యామ్‌తో తీసుకొచ్చారు. ఇది మరో 4GB వర్చువల్‌ ర్యామ్‌ను కలిగి ఉంది. అలాగే 128GB స్టోరేజ్‌ను కూడా మెుబైల్‌కు అందించారు. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను TB వరకూ పెంచుకునే వెసులుబాటు ఉంది. 

    బిగ్‌ బ్యాటరీ

    Vivo Y36i మెుబైల్‌ బిగ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చారు. దీనికి 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. దీని సాయంతో మెుబైల్‌ను వేగంగా ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. 

    కెమెరా

    ఈ వివో మెుబైల్‌ను డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. 13MP ప్రైమరీ కెమెరాను ఫోన్‌ను ఫిక్స్‌ చేశారు. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 5MP కెమెరాను అందించారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 

    కనెక్టివిటి ఫీచర్లు

    ఈ ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth 5.1, USB Type-C port, GPS వంటి కెనక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే సైడ్‌మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, AAC, aptX, LDAC, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ వంటివి ఫోన్‌కు అందించారు. 

    కలర్ ఆప్షన్స్‌

    Vivo Y36i మెుబైల్‌ మూడు కలర్‌ వేరియంట్లను కలిగి ఉంది. ఫాంటసీ పర్పుల్‌ (Fantasy Purple), గెలాక్సీ గోల్డ్‌ (Galaxy Gold), డీప్‌ స్పేస్‌ బ్లాక్‌ (Deep Space Black) రంగుల్లో ఫోన్‌ లాంచ్ అయ్యింది. 

    ధర ఎంతంటే?

    Vivo Y36i మెుబైల్ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలోనే భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా వీటిని విడుదల చేయనున్నట్లు వివో వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మెుబైల్‌ చైనాలో CNY 1,199 సేల్‌ అవుతోంది. దీని ప్రకారం భారత్‌లో ఈ ఫోన్‌ ధర రూ.14,000 వరకూ ఉండవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv