గతేడాది డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్ సెమీస్ దశకు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచులు, అభిమానుల కేరింతలు, క్రీడాకారుల ప్రతిభ ఇలా అనేక అంశాల మేళవింపుగా కొనసాగిన ఈ క్రీడా సమరంలో చివరికి నాలుగు జట్లు సెమీస్ చేరాయి. ఆ జట్లు సెమీస్‌కి చేరడానికి గల కారణాలు ఏంటి? వారిలో విజేతగా నిలిచే అవకాశాలు ఎవరికీ ఉన్నాయో? ఒకసారి పరిశీలిద్దాం.
క్వాలీఫై అయిన జట్లు ఆరు
మొత్తం 12 జట్లు పాల్గొన ఈ లీగ్‌లో ఆరుజట్లు నాకౌట్ దశకు చేరాయి. వీటిలో పాయింట్ల పట్టికల్లో మొదటి, రెండు స్థానాలు సాధించిన పాట్నా పైరేట్స్, దబాంగ్ దిల్లీ సెమీస్ చేరాయి. ఎలిమినేటర్ 1 రౌండ్‌లో పుణేరి పల్టన్‌పై యూపీ యోధ 42-31 తేడాతో గెలుపొంది సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అలాగే ఎలిమినేటర్ 2 రౌండ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను బెంగళూరు బుల్స్ 49-29 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
సెమీస్ చేరిన జట్లు నాలుగు
పాట్నా పైరేట్స్
దబాంగ్ దిల్లీ
యూపీ యోధ
బెంగళూరు బుల్స్
ఆయా జట్ల పాయింట్లు- ముఖ్యమైన ఆటగాళ్లు
పాట్నా పైరేట్స్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌లో మంచి సక్సెస్‌ఫుల్ జట్టుగా పాట్నా పైరేట్స్‌కి పేరుంది. మొత్తం 8 సీజన్లలో 5 సార్లు ప్లే ఆఫ్స్‌కి చేరి వరుసగా సీజన్ 3, 4, 5 లలో విజేతగా నిలిచింది. ఈ జట్టు 8వ సీజన్‌లో 22 మ్యాచులు ఆడి 16 మ్యాచుల్లో గెలిచి 5 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. ప్రశాంత్ కుమార్ రాయ్ పాట్నా జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో సచిన్ తన్వార్, మోను గోయత్ బెస్ట్ రైడర్లుగా, మహమ్మద్రిజ టాప్ డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు.
దబాంగ్ దిల్లీ: ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడ టైటిల్‌ని ముద్దాడనప్పటికీ ఈ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 22 మ్యాచుల్లో 12 గెలిచి 6 ఓడిపోయింది. 4 మ్యాచులు టైగా ముగిసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీస్ చేరింది. ఈ జట్టుకు జోగిందర్ సింగ్ నర్వాల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా సందీప్ నర్వాల్, మంజిత్ చిల్లర్, విజయ్ మాలిక్ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.
యూపీ యోధ: ఈ జట్టు టైటిల్‌ని నెగ్గనప్పటికీ ఎక్కువ సార్లు నాకౌట్ స్థాయికి చేరకుంది. యూపీ యోధ 22 మ్యాచులు ఆడి 10 విజయాలు, 9 పరాజయాలు నమోదు చేసుకుంది. 3 మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఎలిమినేటర్ రౌండ్‌లో పుణేరి పల్టన్‌పై గెలుపొంది సెమీస్ చేరుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పర్‌దీప్ నర్వాల్ సీజన్‌లోనే బెస్ట్ రైడర్‌గా రాణిస్తున్నాడు. ఇతడు గత సీజన్‌లో వేరే జట్లకు కప్ కూడ అందించాడు. అలాగే ఈ జట్టులో నితీశ్ కుమార్, సురేందర్ గిల్ బెస్ట్ ప్లేయర్స్‌గా ఉన్నారు.
బెంగళూరు బుల్స్: టాప్ రైడర్ పవన్ శరావత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు 8వ సీజన్‌లో అదరగొడుతుంది. మొత్తం 22 మ్యాచుల్లో 11 విజయాలు, 9 పరాజయాలు, 2 మ్యాచులు డ్రా అయ్యాయి. ఈ జట్టు సీజన్ 6లో విజేతగా, సీజన్ 2లో రనరప్‌గా నిలిచింది. డాంగ్లీ, పవన్ శరావత్ కీ ప్లేయర్లుగా ఉన్నారు. ఎలిమినేటర్ 2లో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొంది ఫైనకి చేరింది.
వీరికే ఎక్కువ అవకాశాలు..
ఈ సీజన్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసుకున్న పాట్నా పైరేట్స్‌కే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జట్టు ఇప్పటికే 3సార్లు టైటిల్ గెలిచిన విశ్వాసంతో దూసుకెళ్తుంది. ప్రత్యర్థి జట్లను ఓడిస్తుంది. అలాగే బెంగళూరు బుల్స్, యూపీ యోధ కూడ గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది.
సెమీస్ మ్యాచులు ఎప్పుడు
పాట్నా పైరేట్స్ x యూపీ యోధ – సెమీస్ 1(ఫిబ్రవరి 23)
దబాంగ్ దిల్లీ x బెంగళూరు బుల్స్ – సెమీస్ 2(ఫిబ్రవరి 23)
(ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు)