భారత మార్కెట్‌లో టాప్ సెల్లింగ్ బ్రాండ్‌లలో రెడ్‌మీ ఒకటి. చైనీస్ కంపెనీ షావోమీ(Xiaomi) ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఇటీవలే పలు మోడళ్లను రిలీజ్ చేసిన షావోమీ.. అక్టోబర్ 26న Xiaomi 14 సిరీస్‌ని లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఈ సిరీస్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లపై లీక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ గ్యాడ్జెట్‌లో తొలిసారి సొంత ఆపరేటింగ్ సిస్టం HyperOS తెస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా తీసుకొస్తుందట. మరి ఈ ఫీచర్లను అయితే చూసి గ్యాడ్జెట్ లవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫోన్ గురించి మరిన్ని ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.
డిజైన్ & డిస్‌ప్లే
కంప్లీట్ అల్ట్రా న్యారో ఫ్లాట్ డిజైన్‌తో Xiaomi 14 రానున్నట్లు లీక్స్ ద్వారా తెలిసింది. సూపర్ ఆమోల్డ్ HDR10+, 2800nits పీక్ బ్రైట్‌నెస్‌తో దీని డిస్‌ప్లే ఉన్నట్లు టాక్. ఇక IP68 డస్ట్/వాటర్ రెసిస్టెంట్(1.5m/30min)ను కలిగి ఉంది. 6.44 అంగుళాల లార్డ్ డిసెప్లే అయితే రెడ్‌మీ 14లో అందుబాటులో ఉండనుంది.
ప్రాసెసర్(Processor)
Xiaomi 14 సిరీస్ ఫస్ట్‌టైం స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్(Qualcomm Snapdragon 8 Gen 3)తో రానుంది. దీని జీపీయూ Adreno 750 చిప్‌తో వస్తున్నట్లు టాక్. ఇక ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14, MIUI 14పై రన్‌కానుంది.
కెమెరా(camera)
రెడ్‌మీ 14 గ్యాడ్జెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50MP(Wide)+ 50MP(Telephoto)+ 50MP(ultrawide) కాన్ఫిగరేషన్‌లో వచ్చింది. ఈ ప్రధాన కెమెరాతో 8K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. ఇక సెల్ఫీ కెమెరా విషయానికొస్తే.. 50 మెగా పిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రైమరీ కెమెరా HDR, పనోరామ ఫీచర్లను కలిగి ఉటుంది. ఫ్రంట్ కెమెరాతో 4K క్వాలిటీతో వీడియోలు అయితే రికార్డు చేయవచ్చు.
బ్యాటరీ కెపాసిటీ
Xiaomi 14 గ్యాడ్జెట్ 4600mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉటుందని టాక్. మరో విశేషమేమిటంటే ఇది వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపొర్ట్ చేయనుందని సమాచారం. వైర్‌డ్ ఛార్జింగ్ అయితే 90W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ అయితే 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Xiaomi 14 కలర్స్
ఈ గ్యాడ్జెట్ రాక్ బ్లూ, మౌంటెన్ పింక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు కలర్స్ ప్రీమియం లుక్స్ అయితే అందిస్తాయి.
స్టోరేజ్
8-16జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజ్ కెపాసిటీతో Xiaomi 14 అందుబాటులో ఉండనుంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని అవసరాన్ని బట్టి 1TB వరకు పెంచుకోవచ్చు.
తొలి ఫోన్‌గా..
రెడ్‌మీ 14 ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ 14పై రన్ అవుతున్నప్పటికీ.. తొలిసారిగా తాను అభివృద్ధి చేసిన HyperOSను ఈ ఫోన్‌లో రెడ్‌మీ తీసుకొస్తోంది. మరి ఈ ఆపరేటింగ్ సిస్టం ఎలా ఉంటుందో అని టెక్‌వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
స్పీకర్స్
ఈ గ్యాడ్జెట్ స్టీరియో స్పీకర్స్‌తో రానుంది. అయితే ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అయితే తొలగించారు.
సెన్సార్స్
గత రెడ్‌మీ ఫోన్లలో ఎలాంటి సెన్సార్లు అందుబాటులో ఉన్నాయో ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఆఫ్టికల్ ఫింగర్ ఫ్రింట్ డిస్‌ప్లే, కంపాస్, గైరో, కలర్ స్పెక్ట్రం వంటి సెన్సార్లను పొందుపరిచారు.
Xiaomi 14 ధర:
దీని ధరపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇండియన్ మార్కెట్‌లో Xiaomi 14 ధర రూ.54,999గా ఉండే అవకాశం ఉంది.
ఎప్పుడు అందుబాటులోకి?
అక్టోబర్ 26న ఈ ఫోన్ అయితే మార్కెట్‌లోకి లాంచ్ అవుతుంది. నవంబర్ తొలి వారంలో Xiaomi 14 సేల్స్‌కు వచ్చే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!