ప్రపంచంలోని సువిశాలమైన దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడి విభిన్నమైన పరిస్థితులు భారత్‌ను ఇతర దేశాలకంటే ఎంతో ప్రత్యేకంగా నిలుపుతోంది. ఉత్తరాన ఉన్న జమ్ముకశ్మీర్ నుంచి దక్షిణాన ఉన్న కన్యాకుమారి వరకూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఎన్నో రోడ్డు మార్గాలు దేశంలో ఉన్నాయి. సముద్ర తీరాలు, పచ్చటి అడవులు, నదులు, ప్రకృతి సోయగాలను తాకుతూ వెళ్లే ఈ రోడ్డు మార్గాలు ప్రయాణికులకు, వాహనాదారులకు ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. అయితే మరికొన్ని రోడ్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆ రహదారుల్లో ప్రయాణించడమంటే ప్రాణాలను పణంగా పెట్టినట్లే. అటువంటి అతి భయంకరమైన భారత్‌లోని టాప్-10 రోడ్డు మార్గాలేవో ఇప్పుడు చూద్దాం.
1. కిష్త్వార్ కైలాష్ రోడ్ (Kishtwar Kailash Road)
భారత్‌లోని అతి ప్రమాదకరమైన రోడ్డు మార్గాల్లో కిష్త్వార్ కైలాష్ ఒకటి. ఇది జమ్ము కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉంది. భూమికి 6,451 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మార్గంలో ప్రయాణం అంటే వాహనదారులకు పెద్ద సవాలే అని చెప్పాలి. మలుపులతో కూడుకొని ఉన్న ఈ మార్గంలో ఒకసారి ప్రయాణించారంటే ఇక జీవితంలో మరిచిపోలేరు. కిష్త్వార్ కైలాష్ రోడ్ ప్రయాణించాలంటే డ్రైవింగ్‌లో నిష్ణాతులై ఉండాలి.
2. ఖర్దుంగ్ లా పాస్ (Khardung La Pass)
లద్ధాఖ్‌లోని లేహ్ జిల్లాలో ‘ఖర్దుంగ్ లా పాస్’ మార్గం ఉంది. చైనా-భారత్‌ను కలిపే ఈ మార్గంలో కఠిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్నందున ఈ ప్రాంతంలో మంచు ప్రభావం అధిక ఉంటుంది. శీతాకాలంలో పెద్ద ఎత్తున మంచు రోడ్డుపై పేరుకు పోయి ఈ మార్గం ఎంతో ప్రమాదకరంగా మారుతుంది. దీంతో ఏటా అక్టోబర్ నుంచి మే వరకూ ఖర్దుంగ్ లా పాస్‌ను అధికారులు మూసివేస్తారు.
3. చాంగ్ లా పాస్ (Chang La Pass)
చాంగ్ లా పాస్ కూడా భారత్‌లోని అతి ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది లద్ధాఖ్‌లోని లేహ్- ష్యోక్ నది లోయ ప్రాంతాన్ని కలుపుతుంది. సముద్ర మట్టానికి 5,360 మీటర్ల ఎత్తులో, ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. దీంతో ఈ రోడ్డు చాలా జారుడుగా ఉంటుంది. పైగా ఈ మార్గంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉంటుంది. థ్రిల్లింగ్ రైడ్ అనుభవం కోరుకునే వారు ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు.
4. NH 22
దేశంలోని అతి ప్రమాదకరమైన జాతీయ రహదారుల్లో NH 22 ముందు వరుసలో ఉంటుంది. ఈ మార్గం ఎక్కువగా పర్వత ప్రాంతాల గుండా పోతుంది. కొండల అంచులను తాకుతూ ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. ఒక వాహనం మాత్రమే సాఫీగా పోయేలా నిర్మించిన ఈ మార్గంలో ప్రయాణమంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నట్లే.
5. లేహ్-మనాలి హైవే (Leh –Manali Highway)
లద్ధాఖ్‌లోని అతి పొడవైన జాతీయ రహదారుల్లో లేహ్-మనాలి హైవే ఒకటి. పర్వత ప్రాంతాలతో నిండి ఉన్న లద్ధాఖ్‌లోని 428 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ హైవే కవర్ చేస్తుంది. హిమాలయ పర్వతాల అంచుల గుండా సాగే ఈ ప్రయాణం వాహనదారులకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బైక్ రైడర్స్ ఫస్ట్ ఛాయిస్‌గా ఈ మార్గం ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేందుకు విదేశాల నుంచి కూడా రైడర్లు వస్తుంటారు.
6. నేరల్- మాథెరన్ రోడ్ (Neral- Matheran Road)
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో నేరల్-మాథెరన్ రహదారి ఉంది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న మార్గం ఎన్నో మలుపులతో వాహనదారులకు సవాళ్లు విసురుతుంది. అయితే వర్షాకాలంలో ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరమనే చెప్పాలి. అత్యంత అనుభవమున్న డ్రైవర్లు మాత్రమే ఈ మార్గంలో సాఫీగా డ్రైవింగ్ చేయగలరు.
7. జోజి లా పాస్ (Zoji La Paas)
జమ్ముకశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ ‘జోజి లా పాస్’ ఉంది. ఈ మార్గం భూమికి 3,538 ఎత్తులో ఉన్న ఈ మార్గంలో డ్రైవర్ ఏమాత్రం అలసత్వం వహించిన ప్రాణాలు పైకి పోవాల్సిందే. అయితే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో ప్రయాణం అంటే వాహనదారులు ఎప్పటికీ మర్చిపోలేరు.
8. రోహ్తంగ్ పాస్ (Rohtang Pass)
హిమాచల్ ప్రదేశ్‌లోని ‘రోహ్తంగ్ పాస్’ కూడా అత్యంత కఠినమైన రోడ్డు మార్గల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. భూమికి 3,979 అడుగుల ఎత్తున్న ఈ మార్గం కూడా ఎత్తైన పర్వతాల గుండా సాగుతుంది. ఈ మార్గంపై మంచు ప్రభావం అధికంగా ఉండటంతో ఏటా మే – నవంబర్ మధ్య మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఆ సమయంలో ఈ రోహ్తంగ్ పాస్ చాలా ట్రాఫిక్ జామ్ ఎదుర్కొంటుంది.
9. నాథు లా పాస్ (Nathu La Paas)
భారత్ చైనాను కలిపే వాణిజ్య మార్గాల్లో ‘నాథు లా పాస్’ ఒకటి. ఇది సముద్ర మట్టానికి 4,310 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ తరచూ కొండచరియలు విరిగి పడుతుంటాయి. భారీగా హిమపాతం కూడా చోటుచేసుకుంటుంది. ఈ కారణాల రిత్యా నాథు లా పాస్‌ను అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా పరిగణిస్తారు.
10. కిన్నౌర్ రోడ్ (Kinnaur Road)
హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నర్ రోడ్ మార్గం మోస్ట్ డేంజరస్ రూట్‌గా చెప్పొచ్చు. ఈ మార్గంలో ప్రయాణించేటపుడు వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే క్షణాల్లో ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. భారీ హిమపాతం సయమంలో ఈ ప్రాంతాన్ని అధికారులు మూసివేస్తుంటారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్