• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 1000Cr క్లబ్‌: భారతీయ చిత్ర పరిశ్రమలో రూ. 1000 కోట్లు కొళ్లగొట్టిన సినిమాలు ఇవే !

    సినిమాలు ఎన్ని విడుదలైనా బాక్సాఫీస్ వద్ద కొన్నే గుర్తుంటాయి. సినిమా కథ ఎలా ఉన్నా ఇప్పుడు కలెక్షన్లదే లెక్క కనుక అవే మాట్లాడుకుందాం. ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందరి అంచనాలు దాటి కోట్లు కొళ్లగొడుతాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలకు ఊహించని కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా రూ. 1000 కోట్లకు మించి వసూళ్ల సునామీ సృష్టించాయి. అవెంటో ఓ సారి తెలుసుకుందాం.

    దంగల్

    అమీర్‌ ఖాన్‌ లీడ్‌ రోల్‌లో కుస్తీ నేపథ్యంలో వచ్చిన చిత్రం దంగల్‌. ఫొగాట్‌ సిస్టర్స్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. దేశం కోసం గోల్డ్‌ తేవాలనుకునే తండ్రి.. కుమార్తెలను ఎలా తీర్చిదిద్దాడనే కథతో తీసిన దంగల్ చిత్రం… బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించింది. కేవలం రూ. 70 కోట్లు పెట్టి తీయగా… రూ. 2000 కోట్లు సాధించింది.

    బాహుబలి 2

    తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ఫస్ట్‌  టైం ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నతో వచ్చిన బాహుబలి 2 సినిమాకు రికార్డుస్థాయి కలెక్షన్లు వచ్చాయి. రూ. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే రూ. 1810 కోట్లు వచ్చాయి. 

    కేజీఎఫ్‌ 2

    “అదిగో పెను నిశ్శబ్దం పగలి ముక్కలవుతున్న భీకర దృశ్యం” అంటూ ఏ ముహుర్తాన రాశారో కానీ, కేజీఎఫ్‌ మేనియా అంతలా కొనసాగుతుంది. ప్రశాంత్ నీల్‌ విజువల్ పవర్‌కి నిదర్శనమే ఈ సినిమా. గోల్డ్‌ మైన్స్‌ ఇతివృత్తంతో వచ్చిన సినిమా వసూళ్ల సునామినీ ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. రూ. 100 కోట్లు పెట్టి సినిమాను తీశారు. రూ. 1200 కోట్లు కొళ్లగొట్టింది ఈ చిత్రం. 

    RRR

    భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన కళాద్భుతం. ఇందులో రామ్‌ – భీమ్ చేసిన విన్యాసాలకు ప్రపంచమే సలాం కొట్టింది. ఆస్కార్‌తో అందలం ఎక్కించింది. అలాంటి చిత్రానికి కలెక్షన్లు రాకుండా ఉంటాయా?. రూ. 550 కోట్లతో తెరకెక్కించగా… రూ. 1200 కోట్లు వసూళ్లు చేసింది.

    పఠాన్‌

    ఏళ్ల తరబడి ఒక్క విజయం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్‌కు మాసివ్‌ హిట్‌ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్‌. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరించి బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు రూ. 225 కోట్ల బడ్జెట్ అయ్యింది. కానీ, రూ. 1000కోట్లకుపైగా వసూలు చేసింది.

    భజరంగీ భాయ్‌జాన్

    సల్మాన్ ఖాన్ డిఫరెంట్‌ రోల్‌లో కనిపించిన చిత్రం భజరంగీ భాయ్‌జాన్‌. ఆంజనేయస్వామి భక్తుడిగా నటించాడు. ఓ చిన్నారిని తన భుజాలపై ఎత్తుకొని సల్లు భాయ్‌ వెళ్తుంటే ఎలా ఉంటుంది. అనుకోకుండా బోర్డర్‌ దాటి పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ పాపను తిరిగి స్వదేశానికి చేర్చేందుకు పడే ప్రయాసను అద్భుతంగా చూపించారు. ఎమోషనల్‌గా ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవ్వటంతో మంచి కలెక్షన్లు వచ్చాయి. రూ. 75 కోట్లు పెట్టి తెరకెక్కించగా… రూ. 969 కోట్లు సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv