• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగైన 2021, 2022 బెస్ట్ టాలీవుడ్ సినిమాలు

    కరోనా మహమ్మారి విజృంభణతో వినోద రంగం పూర్తిగా దెబ్బతింది. దీంతో అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్ ఫ్లిక్స్, ఆహాలాంటి ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వినోద ప్రియులను అలరించేందుకు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా సినిమాలను స్ట్రీమింగ్ చేశాయి. భారీ బడ్జెట్ మూవీల దగ్గరి నుంచి వెబ్ సిరీస్‌ల వరకు ఒకే వేదికపై తీసుకొచ్చాయి. ఇలా తెలుగు సినీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన బెస్ట్ అమెజాన్ ప్రైమ్ 2021,2022 తెలుగు సినిమాలు ఏంటో మీరూ తెలుసుకోండి.

    1. పుష్ప(పార్ట్-1)

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. రష్మిక మంధానా హీరోయిన్‌గా అలరించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. పుష్ప పార్ట్-2 కూడ త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది.

    2. జై భీమ్

    సూర్య ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో నటించిన ఈ సినిమా ఈ దశాబ్దంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. జస్టిస్ చంద్రు రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా డైరెక్టర్ టీజే జ్ఞాన‌వేల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్రమంగా తనను భర్తను చంపేశారంటూ ఓ మహిళ చేసిన పోరాటానికి నిదర్శనమే ఈ సినిమా.

    3. నారప్ప

    తమిళ్ మూవీ అసురన్‌కి రీమేక్‌గా నిర్మించిన ఈ సినిమాలో వెంకటేశ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఆవేశంతో తప్పు చేసిన తన కొడుకుని కాపాడుకోవడానికి ఓ తండ్రి ఎంతలా తపన పడతాడో ఈ సినిమాలో చూపించారు. ప్రియమణి, రాజీవ్ కనకాల ఈ మూవీలో ప్రధానపాత్ర పోషించారు.

    4.వకీల్ సాబ్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కోసం ఎదురుచూసిన అభిమానులకు వకీల్ సాబ్ పండుగ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీని కూడ బాలీవుడ్ చిత్రం పింక్ నుంచి రీమేక్ చేశారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించాడు. నివేదా థామస్, అనన్య నాగళ్ల, అంజలి లీడింగ్ రోల్‌లో నటించారు.

    5.టక్ జగదీశ్

    ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పెన్స్ సాధించింది. నాని హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీకి శివ నిర్వణ దర్శకత్వం వహించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించారు. తండ్రి మరణంతో విచ్ఛిన్నమైన ఫ్యామిలీని చిన్నవాడైన జగదీశ్ ఎలా ఒక్కటి చేశాడనేదే సినిమా సారాంశం.

    6.జాతి రత్నాలు

    అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం బిగ్గెస్ట్ హిట్ సాధించింది. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు తమ పంచ్‌లతో ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ చిత్రంతో ఫరియా అబ్ధుల్లాకి మంచి గుర్తింపు దక్కింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా రూ.80 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది. నాగ్ అశ్విన్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.

    7.మాస్టర్

    తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడ తెరకెక్కించారు. ఈ మూవీలో విలన్‌గా విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపరనే చెప్పాలి. తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడ ఈ మూవీకి మంచి ఆదరణ దక్కింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఎస్. జేవియర్ బ్రిట్టో నిర్మాతగా వ్యవహరించారు. రూ.135 కోట్లతో రూపొందించగా దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు చేసింది.

    8.కొండపొలం

    ఉప్పెన సినిమా తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రెండో చిత్రమిది. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించారు. కృష్ణ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ కమర్షియల్‌గా అంతగా రాణించనప్పటికీ కథపరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv