ప్రీమియం స్పోర్ట్స్ బైక్‌లకు భారత్‌లో క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఈ విధమైన బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రముఖ బైక్ తయారీ సంస్థలు పవర్‌ఫుల్ ఇంజిన్‌తో అత్యాధునిక బైక్‌లను భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే KTM కంపెనీ తన అప్‌డేటెడ్ 390 అడ్వెంచర్ బైక్ ఫీచర్లను రివీల్ చేసింది. ‘2024 KTM 390 Adventure’ పేరుతో ఈ నయా కేటీయం బైక్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఎడిషన్‌లో కంపెనీ చేసిన మార్పులు, అప్‌గ్రేడ్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం.
బైక్ ఇంజిన్
2024 కేటీఎం 390 అడ్వెంచర్ బైక్.. 373.2 cc.. సింగిల్ సిలిండర్.. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 43 bhp పవర్‌ను, 37 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. క్విక్ షిఫ్టర్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఫీచర్లతో స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఫ్యూయల్ & మైలేజ్
ఈ నయా కేటీఎం బైక్ 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో రాబోతోంది. ఈ బైక్ లీటర్‌కు 30 kmpl మైలేజ్ ఇవ్వనున్నట్లు ఆటోమెుబైల్ వర్గాలు చెబుతున్నాయి. పవర్‌ఫుల్ ఇంజిన్ కారణంగా ఈ బైక్ 0-100 kmph అందుకోవడానికి కేవలం 6.07 సెకన్స్ తీసుకుంటుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ట వేగం 155 kmph.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
కేటీఎం 390 అడ్వెంచర్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్, ట్రెండింగ్ ఫీచర్లు ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ABS సిస్టమ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, LED హెడ్‌ల్యాంప్ సెటప్, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ స్విచ్‌గేర్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ బైక్‌లో ఉన్నాయి.
టీఎఫ్‌టీ డిస్‌ప్లే
2024 KTM 390 Adventure బైక్ 5 అంగుళాల కలర్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది రైడర్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను డిస్‌ప్లే ద్వారా తెలియజేస్తుంది. ట్యాంక్‌లోని ఫ్యుయల్, బైక్ వేగం వంటి సమాచారాన్ని డిస్‌ప్లే ద్వారా రైడర్ తెలుసుకోవచ్చు.
బైక్ కలర్
ఈ అడ్వెంచర్ బైక్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వైట్ (Wight), ఆరెంజ్ (Orange) కలర్ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
2024 KTM 390 Adventure ధర, విడుదల తేదీని కేటీఎం కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ బైక్ వచ్చే జనవరిలో విడుదలవుతుందని సమాచారం. దీని ధర రూ. 3.11 లక్షలు (Ex-showroom) ఉండొచ్చని అంచనా. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బైక్ ముందస్తు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆసక్తిగల వారు కేటీఎం అధికారిక వెబ్‌సైట్‌లో రూ.4,499 చెల్లించి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం