బజాజ్ పల్సర్ 150- రూ.1.30 లక్షలు
భారతదేశంలో సరసమైన ధరలో వస్తున్న బైక్ పల్సర్. ఇది 149.5 సీసీ ఇంజిన్. 14పీఎస్ హార్స పవర్, 13.25 టార్క్ కలిగి ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.
యమహ FZ-V3- రూ. 1.35 లక్షలు
భారత్ లోని స్ట్రీట్ బైక్ లలో ఇది పాపులర్. 149 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించారు. దీని హార్స్ పవర్ 12.4PS, టార్క్ 13.3NPMగా ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్, మోనో షాక్స్ బండి వేడి కాకుండా ఉంచుతాయి.
టీవీఎస్ అపాచీ RTR 180-రూ. 1.40 లక్షలు
టీవీఎస్ అపాచీ సౌకర్యవంతంగా ఉండే బైక్. 177.4 సీసీ ఇంజిన్ ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ , హార్స్ పవర్ 17.02PS, టార్క్ 15.50NM సౌకర్యం ఉంది. దీని సస్పెన్షన్ సెటప్ టెలిస్కోపిక్ ఫోర్క్ కలిగి ఉంటుంది. వెనుక భాగంలో షాక్ అబ్సార్బర్స్ ఉన్నాయి.
హీరో ఎక్స్ ట్రీమ్ 160R-రూ., 1.40 లక్షలు
హీరో ఎక్స్ ట్రీమ్ తక్కువ బరువున్న బైక్స్‌లో ఒకటి. అత్యాధునిక ఫీచర్స్ తో తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇందులో 166 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. 15.2PS హార్స్ పవర్, 14 NM టార్క్ ఉన్నాయి. ఏడు విభాగాల అడ్జస్టబుల్ షాకప్స్ ఉన్నాయి. మైలేజీ కూడా ఇస్తుంది.
హోండా యూనికార్న్ 150- రూ. 1.40 లక్షలు
ట్రాఫిక్ లో ప్రయాణించేందుకు యూనికార్న్ 150 అధ్భుతమైన వాహనం. సీబీ యూనికార్న్ లో 149.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ సామర్థ్యం ఉంది. 13PS హార్స్ పవర్ , 12.80 NM టార్క్ స్పీడ్ ఉంది. హైవేలపై లీటరుకు 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దాదాపు పట్టణాల్లోనూ అంతే మైలేజీ వస్తుంది.
టీవీఎస్ అపాచీ 200 4V- రూ. 1.60 లక్షలు
దేశంలో 200 సీసీ ఇంజిన్ కలిగిన బైక్ లలో టీవీఎస్ అపాచీ 200 ఆర్ టీఆర్ కు గుర్తింపు ఉంది. 197.7సీసీ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఆయిల్ కూలర్ ఇవ్వబడింది. 20.82PS @ 9000 rpm హార్స్ పవర్, స్పోర్ట్ మోడ్ లో 17.25NM @7250 rpm , అర్బన్ లో 17.32NM, రెయిన్ మోడ్ లో 16.51NM ఉంటుంది.
హీరో హార్నెట్ 2.0- రూ. 1.65 లక్షలు
హోండా నుంచి విడుదలైన బేసిక్ స్పోర్ట్స్ మోడల్ హీరో హార్నెట్. ఇందులో చాలా ఫీచర్స్ ను మెరుగుపరిచారు. ఇది 184 సీసీ ఇంజిన్ తో 17.27 PS హార్స్ పవర్ , 16.1NM టార్క్ స్పీడ్ కల్పించారు.
హీరో ఎక్స్ పల్స్ 200 4V-రూ. 1.65 లక్షలు
ఇండియాలో సరసమైన ధరలో దొరుకుతున్న బైక్ లలో ఇది ఒకటి. ఇది 199.6 సీసీ ఇంజిన్ తో 19.71PS హార్స్ పవర్, 17.35nm టార్క్ స్పీడ్ తో అందుబాటులో ఉంది. ఇది లీటర్ కు 51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
బజాజ్ NS 200-రూ. 1.70 లక్షలు
2 లక్షల రూపాయల లోపు ఉన్న ద్విచక్ర వాహనాలల్లో స్టైలిష్ బైక్ బజాజ్ ఎన్ ఎస్-200. ఇది 199 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉంది. ఈ బీఎస్ -6 ఫీచర్స్ కలిగిన బండి దాదాపు లీటరుకు 41 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
బజాజ్ పల్సర్ N 250- రూ. 1.76 లక్షలు
250 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో 24.5PS హార్స పవర్ తో బజాజ్ ఈ బైక్ ను రూపొందించింది. ఇది FZ-250, GIXER-250ని పోలి ఉంటుంది.
హోండా సీబీ 200X- రూ. 1.77 లక్షలు
రోడ్డు ప్రయాణంలో అత్యంత సౌకర్యవంతంగా ఉండే ద్విచక్ర వాహనాల్లో ఇది ఒకటి. ఇందులో 184.40 సీసీ ఇంజిన్ ఉంది. క్రూయిజర్లు నచ్చే వారికి, యాత్రికులకు ఈ బైక్ ఉపయోగపడుతుంది.
యమహా R15 V3-రూ. 1.94 లక్షలు
R15 V3 155 సీసీ ఇంజిన్ తో వీవీఏ సౌకర్యం కలిగి ఉంది. 18.6PS హార్స్ పవర్ ఉండటంతో పాటు 6 స్పీడ్ గేర్ బాక్స్ ను ఇచ్చారు. అత్యంత స్టైలిష్ బైక్ లలో ఇది ఒకటి
యమహా MT-15 V2- రూ. 1.95 లక్షలు
యమహా MT ను అత్యద్భుతమైన డిజైన్ లో రూపొందించారు. ఇది 155 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉండి లీటరుకు 56.87 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
కేటీఎం డ్యూక్ 125- రూ. 2 లక్షలు
కేటీఎం బ్రాండ్ లో డ్యూక్ బైక్ మంచి ధరలకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ ద్విచక్ర వాహనాల్లోనే టాప్ గా నిలిచింది. 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. ముందు వెనుక డిస్క్ బ్రేక్ లు ఉంటాయి. లీటర్ కు 48 కిలీమీటర్ల మైలేజీ ఇస్తుంది.