నాగశౌర్య, కేతిక శర్మ నటించిన ‘లక్ష్య’ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం అందించిన ఈ సినిమాలో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ వంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ప్రమోషన్లు, ట్రైలర్, సాంగ్స్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా నాగశౌర్య ఈ సినిమాకోసం కష్టపడి 8 ప్యాక్ బాడీ పెంచాడు. మరి దాని ఫలితం ఎలా ఉంది? ఇంతకీ సినిమా ఎలా ఉంది? స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
స్పోర్ట్స్ నేపథ్యంలో చాలా కథలు వచ్చినప్పటికీ..విలువిద్య నేపథ్యంలో ఇప్పటివరకూ ఎవరు సినిమా తీయలేదు. ఈ రకంగా చూస్తే స్టోరీ కొత్తదే. అయితే ఇటువంటి సినిమాల్లో ఎమోషన్స్ మాత్రం కామన్‌గానే ఉంటాయి. హీరో కష్టపడి ఆటలో నిలదొక్కుకోవడం, విలన్ అతడిని ఓడించాలని చూడటం..అన్నీ అవాంతరాలు దాటుకొని చివరికి హీరో గెలవడం ఇవన్నీ అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో చూసేవే. మరి ఈ సినిమాలో దానికిమించి కొత్తగా ఏమైనా చూపించారా అంటే లేదనే చెప్పాలి. ఆర్చరీ స్పోర్ట్ ఒక్కటి కొత్తది కాని.. కథ ఊహించనట్లుగానే ఉండటం, ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం.. కథనం సరిగా లేకపోవడంతో స్టోరీ వర్కవుట్ కాలేదు.
పార్థు (నాగశౌర్య) తండ్రి ఆర్చరీ స్పోర్ట్స్‌మెన్. అతడికి చాంపియన్ కావాలని కోరిక ఉంటుంది. అయితే కోరిక నెరవేరకుండానే మరణిస్తాడు. దీంతో తన మనవడిని ఎలాగైనా చాంపియన్ చేయాలనే లక్ష్యంతో ఉంటాడు పార్థు తాత (సచిన్ ఖేడ్కర్). చిన్నప్పటినుంచి ఈ ఆటపై దృష్టిపెడతాడు. అయితే ఆటలో పోటీదారుడు రాహుల్ (శత్రు), పార్థుని ఎలాగైనా ఓడించాలని తీవ్ర ప్రయత్నాలన్నీ చేస్తాడు. ఈ క్రమంలో పార్థు చేతికి గాయం అవుతుంది. దీంతో గేమ్ ఆడలేకపోతాడు. డ్రగ్స్‌కి బానిసవుతాడు.
ఇకసెకండాఫ్లో పార్థు తాత మరణిస్తాడు. ఆ తర్వాత స్టోరీ కొంచెం స్పీడ్ పెరిగినట్లు అనిపిస్తుంది. జగపతిబాబు(పార్థసారథి) ఎంట్రీ ఇచ్చి, హీరోకి సాయం చేస్తుంటాడు. కానీ ఆయన పాత్ర కూడా సరిగా పండలేదనే చెప్పుకోవాలి. ఇక చివరికి పార్థు తను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు. కొన్ని సీన్లు లాజిక్ లేకుండా మరీ సినిమాటిక్‌గా ఉంటాయి. చివర్లో నాగశౌర్య 8ప్యాక్ బాడీ రివీల్ చేయండం..కొన్ని యాక్షన్ సీన్లు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సినిమా కోసం నాగశౌర్య పడిన కష్టం తెరపై కనిపిస్తుంది.
రితిక(కేతిక శర్మ) విషయానికొస్తే అప్పుడప్పుడు అలా కనిపించి మాయమైపోతుంది. . లవ్‌స్టోరీ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత వర్కవుట్ కాలేదు. కథ కొత్తగా ఉన్నప్పటికీ కథనం బాగాలేకపోవడంతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేరు. నాగశౌర్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వైవా హర్ష, సత్య లాంటి కమెడియన్స్ ఉన్నా పెద్దగా కామెడీ లేదు. అటు ఎంటర్టైన్మెంట్లోనూ..ఇటు ఎమోషన్స్‌లోనూ బలం లేకుండా పోయింది. మొత్తానికి నాగశౌర్య లక్ష్యం గురితప్పిందని పబ్లిక్ టాక్.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి