ఐకాన్ స్టార్‌గా అలరిస్తున్న అల్లు అర్జున్‌కి సినీ ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అల్లు వారి ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన నటనతో, స్టైల్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు. గంగోత్రి నుంచి పుష్ప మూవీ వరకు విభిన్న క్యారెక్టర్లు, ఆకట్టుకునే యాక్టింగ్ స్కిల్స్‌తో సినీ ప్రేక్షకులను వినోదాన్ని పంచాడు. ఇంతగా తెలుగు సినీ పరిశ్రమలో ఓ ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ నేడు తన 41వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో టాప్-10 మూవీస్ ఏంటో మీరూ తెలుసుకోండి.
1.ఆర్య(2004)
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. కాస్త ప్రేమ, కాస్త యాక్షన్, కాస్త రొమాంటిక్ సన్నివేశాలు చక్కగా కలగలిపిన చిత్రంగా ఆర్య నిలిచింది. ఈ చిత్రంతో అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టింది.
2.దేశముదురు( 2007)
ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయం నమోదు చేసుకుంది. అల్లు అర్జున్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఇది. ఈ సినిమా నుంచే టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ పరిచయం అయ్యింది.
3.పరుగు (2008)
పక్కా ఎమోషనల్ కథతో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను రూపొందించిన తీరు బాగుంది. నటనపరంగా అల్లు అర్జున్ను మరో మెట్టుపైకి ఎక్కించింది. ఇది మంచి రొమాంటిక్ డ్రామా మూవీ. ఇందులో ప్రతి సన్నివేశం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ప్రకాశ్ రాజ్, షీలా కౌర్ నటన కూడ ఆకట్టుకుంటుంది.
4.వేదం( 2010)
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సామాజిక అంశాలను కథాంశంగా తీసుకుని సినిమాను నిర్మించిన తీరు బాగుంది. సమాజంలో జరిగే వాస్తవివతకు ఈ చిత్రం చాలా దగ్గరగా ఉంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
5. జులాయి(2012)
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అల్లు అర్జున్, సోనూసూద్‌ల నటన మూవీకి హైలెట్‌గా నిలిచాయి. మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
6. రేసుగుర్రం(2014)
ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించారు. 2014లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. అల్లు అర్జున్ నటన పరంగా,యాక్షన్ పరంగా, డాన్స్ పరంగా చాలా బాగా నటించాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు ఈ మూవీని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి.
7.సన్నాఫ్ సత్యమూర్తి (2015)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. టాక్‌పరంగా, కలెక్షన్ల పరంగా ఈ చిత్రం చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. అల్లు అర్జున్ ఒక కొత్త తరహా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సక్సెస్ అయ్యారు. కుటుంబ విలువల నేపథ్యం మూవీకి హైలెట్‌గా నిలిచింది.
8.నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర అందరినీ మెప్పించింది. జవాన్ అంటే ఏంటో తెలిసేలా చేసిన తన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా పరంగా ప్లాప్ అయినప్పటికి కమర్షియల్‌గా మంచి హిట్ సాధించింది. అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. వక్కత్వం వంశీ దర్శకత్వం వహించారు.
9. అల వైకుంఠపురంలో..( 2020)
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 3వ మూవీ ఇది. త్రివిక్రమ్ కథ, సినిమా నిర్మాణ విలువలు బాగుండడంతో మంచి విజయం సాధించింది. ఈ మూవీ ఫ్యామిలీ నేపథ్యంలో కొనసాగుతూ..సెంటిమెంట్స్, మంచి ఎమోషన్స్ పండించింది.
10. పుష్ప ( 2021)
సుకుమార్- అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన 3వ సినిమా ఇది. పక్కా మాస్, డీ-గ్లామర్ రోల్లో అల్లుఅర్జున్ అభిమానులను అలరింపజేశాడు. 2021, డిసెంబర్ 17న రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఈ మూవీలోని పాటలు, కొన్ని సిగ్నేచర్ సీన్లు ఇప్పటికీ ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో, దేశ సినీ చరిత్రలో పుష్ప ప్రభంజనం సృష్టించిందని చెప్పడం అతిశయోక్తి కాదు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!